చంద్రయాన్ 3పై పాక్ మూకలకు ఇంత కుళ్లా.. మైండులో ఏముందో?

Update: 2023-08-24 11:06 GMT

ఒక దేశంలో అభివృద్ధిలో రాకెట్ వేగంతో అంతరిక్షంలో జెండాలు పాతుతోంది. మరో దేశం అంతర్గత సమస్యలు, సైనిక పెత్తనంతో అధోగతి పాలవుతోంది. రెండూ ఒకేసారి స్వాతంత్య్రం పొందినా ఒకటి అగ్రరాజ్యాలతో పోటీ పడుతుంటే మరొకటి అట్టడుగు రాజ్యాల జాబితాలోకి జారిపోయింది. ఇల్లు దిద్దుకోవడం చేతగాక పొరిగింటి మీద పడి ఏడుస్తోంది. చంద్రయాన్ 3 ప్రాజెక్టు మంట గలవాలని, విక్రమ ల్యాండర్ నాశనం కావాలని కొందరు పాకిస్తానీలు దేవుడికి మొరపెట్టుకున్నారు. అనుకునేదేమో మనసులో అనుకోకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కుళ్లు బయటపెట్టుకుని నవ్వుల పాలయ్యారు. భారత్ అంతరిక్ష ప్రయోగాలు జరిపినప్పపుడల్లా పాక్‌లోని భారత వ్యతిరేకులు ఇలాంటి పిల్లి శాపాలు పెట్టడం మామూలే. కాకపోతే చంద్రయాన్ విజయవంతంగా కక్ష్యలోకి వెళ్లి ల్యాండ్ అవడంతో మరింత కుళ్లుకుంటున్నారు. భారత్ నాశనాన్ని కోరుతూ పోస్టుల పెట్టారు.

పాకిస్తాన్ మీడియా కూడా చంద్రయాన్ 3 సక్సెస్‌పై ఒక్క ముక్క కూడా రాయలేదు. బీబీసీ, న్యూయార్క్ టైమ్స్ వంటి పాశ్చాత్య మీడియా చంద్రయాన్‌పై బ్యానర్లు పెట్టి వార్తలు రాయగా పాక్ లోని ప్రముఖ పత్రికలు మాత్రం ఓ మూల నాలుగు వాక్యాల్లో సరిపెట్టాయి. కొన్ని పత్రికలు, చానళ్లు అది అసలు వార్తే కాదన్నట్లు ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే పాక్ ప్రజల్లో కొందరు చంద్రయాన్ సక్సెస్ కావాలని కోరుకోవడం విశేషం. ‘ఇది భారత్ విజయమే కాదు, దక్షిణాసియా దేశాల విజయం కూడా’’ అని అభినందిస్తున్నారు. ‘‘చంద్రుడి మీదికి మాత్రమే కాదు భారత్ తలచుంటే అంగారకుడిపై అన్ని గ్రహాలపైకి ల్యాండర్లను పంపుతుంది. ఆ దేశ సైన్స్ టెక్నాలజీ అద్భతం’’ అని అంటున్నారు. కొందరైతే, ‘‘ఒకేసారి అవతరించిన దేశాలు మధ్య ఎంత అంతరముందో ఈ విజయం చాటిచెబుతోంది. మా దేశాన్ని నాయకులు సర్వనాశనం చేశారు. భారత నేతలు అద్భుత విజయాలు సాధిస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ అసూయ పోస్టులకు భారతీయులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ‘‘ఒక దేశం జెండాపై చంద్రుడి బొమ్మ, చంద్రుడిపై ఒక దేశం జెండా. ఎదగండి బ్రదర్’’ అని పాక్ జాతీయ పతాకాన్ని ఉద్దేశించిన ఎద్దేవా చేస్తున్నారు.

Tags:    

Similar News