దుబాయ్లో పాకిస్తాన్కు ఘోర అవమానం.. బుర్జ్ ఖలీఫాపై..

Update: 2023-08-15 04:02 GMT

పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. అంతర్గత కుమ్ములాటలు, అడుగంటిన ఆర్థిక వనరులతో దేశం ఆగచాట్లు పడుతోంది. అటు మిగితా దేశాలు పాక్ను లైట్ తీసుకుంటున్నాయి. దీనికి తాజాగా జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఏ దేశమైనా స్వాతంత్య్రాన్ని జరిపుకుంటే వారికి విషెస్ చెబుతూ బుర్జ్ ఖలీఫాపై ఆ దేశ జెండాను ప్రదర్శిస్తారు. ఇది ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఇవాళ భారత స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో మన జెండాను అక్కడ ప్రదర్శించారు. అయితే ఇక్కడే పాక్కు అవమానం ఎదురైంది.

పాకిస్తాన్ జెండా కూడా ప్రదర్శిస్తారని ఆ దేశవాసులు బుర్జ్ ఖలీఫా దగ్గరకు భారీగా తరలివచ్చారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. ఎందుకంటే పాక్ జెండాను అక్కడ ప్రదర్శించలేదు. దీంతో బుర్జ్ ఖలీఫా అధికారులపై పాకిస్తానీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అయినా దుబాయ్ అధికారులు వారిని పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఇది తమకు పరువు సమస్య అని.. తమ దేశాన్ని అవమానించడమే అని పలువురు పాకిస్తానీయులు వాపోయారు. తమ దేశ ప్రభుత్వానికి తగిన శాస్తి జరిగిందని ఓ పాక్ మహిళ అన్నారు. కాగా సరిగ్గా 12 గంటలకు బుర్జ్ ఖలీఫాపై భారత జెండాను ప్రదర్శించారు. . ఈ సమయంలో భారత జాతీయ గీతంను కూడా వినిపించింది. ఈ అద్బుత దృశ్యాలను చూసిన భారతీయులు హర్షం వ్యక్తం చేశారు.

Indian flag on Burj Khalifa.

Tags:    

Similar News