గాల్లో ఉండగా విమానంలో మంటలు.. ఆ తర్వాత ఏం జరగిందంటే..?

By :  Krishna
Update: 2024-01-19 11:28 GMT

ఓ విమానం ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయ్యింది. కాసేపటికే అందులో మంటలు చెలరేగాయి. గాల్లో ఉండగా మంటలు అంటుకోవడం పైలట్లు చాకచక్యంగా వ్యవహరించారు. మళ్లీ అదే ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కాలేదు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. మియామీ ఎయిర్ పోర్టు నుంచి అట్లాస్ ఎయిర్కు చెందిన బోయింగ్ 747-8 విమానం ప్యూర్టోరికాకు బయలుదేరింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మంటలు చెలరేగాయి.

మంటలను గమనించిన పైలట్లు విమానాన్ని వెనక్కి తిప్పి.. అదే ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇది కార్గో విమానమని.. సిబ్బందికి ఎటువంటి గాయాలు అవ్వలేదని అట్లాస్ ఎయిర్ తెలిపింది. ఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.




Tags:    

Similar News