చైనా పోలీసుల అదుపులో ఫుట్​బాల్​ దిగ్గజం.. ఏం జరిగిందంటే?

Update: 2023-06-12 16:20 GMT

అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. వీసా లేకుండా చైనాలోకి ప్రవేశించాడని అదుపులోకి తీసుకున్నారు. గురువారం బీజింగ్ లోని వర్కర్స్ స్టేడియంలో ఆస్ట్రేలియా- అర్జెంటీనా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరుగనుంది. అందుకు చైనా వచ్చిన మెస్సీని ఎయిపోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న టైంలో.. మెస్సీ వద్ద అర్జెంటీనా, స్పానిష్ పాస్ పోర్ట్ లు ఉన్నాయి.




స్పానిష్ పాస్ పోర్ట్ తో తైవాన్ లో వీసా ఫ్రీ ఎంట్లీ ఉంటుంది. కానీ, అలా చైనాలో ప్రవేశం లేదు. అయితే, తైవాన్ చైనాలో భాగం అని భావించిన మెస్సీ.. ఆ వీసా వెంటబెట్టుకుని వచ్చాడు. దాంతో చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెస్సీ పోలీసులతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, చివరికి ఈ సమస్య పరిష్కారం అయింది. 20 నిమిషాల తర్వాత మెస్సీని ఎయిర్ పోర్ట్ అధికారులు బయటికి పంపించారు. మెస్సీకి ఎక్స్ పిడైటెడ్ వీసా ను ఇచ్చినట్లు తెలుస్తోంది.



Full View





 




Tags:    

Similar News