జాంబియాలో కలరా విజృంభిస్తోంది.ఇప్పటికే 600 మందికి ఈ వ్యాధికి బలయ్యారు. మరో 15వేల మంది ఇన్ఫెక్షన్‌తో భాధపడుతున్నారు. గత సంవత్సరం ఆక్టోబర్ నుంచి కలరా పీడిస్తోంది. పది ప్రావిన్సులో 9 ప్రావిన్సుకలరా కేసులున్నాయి. దీంతో భారత్ జాంబియాకు 3.5 టన్నుల మానవతా సాయం పంపింది. ఇందులో నీటిశుద్ధి యంత్రాలు, కలరా నివారణ ఔషధాలు, హైడ్రేషన్ కోసం ఓఆర్ఎస్ సాచెట్లు వంటివి అందులో ఉన్నాయి. ఎన్నడూ ఎరుగని విపత్తును ఎదుర్కొంటున్న ఈ చిన్న దేశంలో కలరా కారణంగా అక్టోబరు 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 వేల మందికిపైగా మహమ్మారి వలలో చిక్కారు.
2 కోట్ల జనాభా ఉన్న జాంబియాలో రోజుకు 400 కంటే ఎక్కువ కలరా కేసులు నమోదవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే జాంబియాలో కలరాని నివారించేందుకు సామూహిక టీకా కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతోపాటు ప్రజలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తోంది. కలరా సోకి తీవ్ర అవస్థలు పడుతున్న రోగులకు దేశ రాజధాని లుసాకాలో ఉన్న భారీ ఫుట్‌బాల్ స్టేడియంలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లను సిద్దం చేసింది.బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షనే కలరా. ఈ కలరా ఇన్ఫెక్షన్ సోకితే తీవ్రమైన డయేరియాకు కారణం అవుతుంది. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. 2023 ప్రారంభం నుంచే మలావీ, మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో కలరా కేసులు వెలుగు చూస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో అతి తీవ్రమైన కలరా వ్యాప్తి 2023 లో మలావీ దేశంలో అత్యంత దారుణంగా ఉందని గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.