మెక్‌డొనాల్డ్స్ సిబ్బందితో కస్టమర్ గొడవ..వీడియో వైరల్

Update: 2023-06-22 12:37 GMT

రెస్టారెంట్స్‌, ఫుడ్ స్టాల్స్ వద్ద గొడవలు జరిగిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఫుడ్ లేదా బిల్ విషయంలో కస్టమర్స్ , సిబ్బంది గొడవకు దిగుతారు. వారం రోజుల క్రితం నోయిడాలోని ఓ మాల్‌లో రెస్టారెంట్ సిబ్బంది, కస్టమర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సర్వీస్ ఛార్జీపై ఇరువర్గాల ఫైటింగ్ చూశా. తాజాగా మరో మరో ఫుడ్ ఫైట్ ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఆస్ట్రేలియాలోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో ఇది జరిగింది.

వైరల్ అయిన వీడియో ప్రకారం...మెక్‌డొనాల్డ్స్ కౌంటర్ వద్ద ఓ కస్టమర్ వేచి ఉన్నాడు. ఆ సమయంలో అతడు సిబ్బందితో ఏదో గొడవపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంతలో సిబ్బందిలో ఒకరు కస్టమర్ ముఖంపై డ్రింక్ చల్లారు. దీంతో కస్టమర్ సైతం సిబ్బందిపై దాడికి దిగాడు. అక్కడున్న ఫుడ్ ఐటెమ్స్ వారిపైకి విసిరి తన కోపాన్ని ప్రదర్శించాడు. సిబ్బంది అందరూ కలిసి అతడిపై ఎదురు తిరగడంతో కాస్త వెనక్కు వచ్చేశాడు. @browncardigan అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియో షేర్ చేయగా..ప్రస్తుతం వైరల్‎గా మారింది. వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సిబ్బందితే తప్పంటే..మరికొందరు మాత్రం కస్టమర్ తీరు కారణంగా సిబ్బంది దాడి చేశారని కామెంట్స్ చేస్తున్నారు.

ఘటనపై మెక్‌డొనాల్డ్స్ యాజమాన్యం స్పందించింది. ఉద్యోగుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కంపెనీ విధానాలకు వ్యతిరేకంగా వ్యహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ఉద్యోగుల పట్ల బెదిరింపులు, దాడి చేయడం వంటి వాటిని తాము సహించమని పేర్కొంది.

Tags:    

Similar News