Disease X : కరోనా కన్నా 20 రెట్లు భయంకరమైన వైరస్..

By :  Kiran
Update: 2023-09-25 09:22 GMT

'కరోనా మహమ్మారి గురించి మరువక ముందే మరో ముప్పు ముంచుకొస్తోంది". ప్రపంచానికి మరో వైరస్ ప్రమాదం పొంచి ఉందని హెల్త్ ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారిలాగే డిసీజ్‌ ఎక్స్‌ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపుతోందని బ్రిటన్‌ వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్ డేమ్‌ కేట్‌ బింగ్‌హామ్‌ ప్రకటించారు. డిసీజ్‌ ఎక్స్‌ ప్రభావం కరోనా కన్నా 20 రెట్లు ఎక్కువని అంటున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం మరో కొత్త మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌లు వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, వాటన్నింటినీ మానవాళికి ముప్పుగా భావించలేమని కేట్ అంటున్నారు. అయితే కొన్ని మాత్రం మనుషులపై తీవ్ర ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. వేల కొద్ది వైరస్‌లున్న 25 వైరస్‌ కుటుంబాలను సైంటిస్టులు నిత్యం పర్యవేక్షిస్తున్నారని, వాటిలో ఏదైనా వైరస్‌ మహమ్మారిగా రూపాంతరం చెందవచ్చని చెప్పారు. కొవిడ్ 19 సోకిన వారిలో ఎక్కువ మంది వైరస్‌ బారి నుంచి బయట పడగలిగారని కానీ డిసీజ్‌ ఎక్స్ మాత్రం ప్రపంవ్యాప్తంగా ఎక్కువ మందిపై ప్రభావం చూపిస్తుందని కేట్‌ అభిప్రాయపడ్డారు.

డిసీజ్ ఎక్స్ను ఎదుర్కొనేందుకు బ్రిటన్ సైంటిస్టులు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు 200 మంది శాస్త్రవేత్తలు విల్ట్‌షైర్‌లోని పోర్ట్‌ డౌన్‌ లేబొరెటరీలో జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్‌లను అడ్డుకునేందుకు వ్యాక్సిన్‌ డెవలప్ చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News