Donald Trump : అమెరికా ఒక విఫల దేశం.. ట్రంప్ సంచలన కామెంట్స్

Byline :  Krishna
Update: 2024-02-20 03:02 GMT

అమెరికాపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు సంచలన కామెంట్స్ చేశారు. అమెరికా ఒక విఫల దేశమని.. రోజురోజుకి క్షీణిస్తోందని అన్నారు. నిజాయితీ లేని లెఫ్ట్ నాయకులు, న్యాయమూర్తులు దేశాన్ని వినాశనం వైపు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ జైల్లో మరణించిన తర్వాత ట్రంప్ స్పందించారు. నావల్నీ మృతికి అమెరికాలో తాను ఎదుర్కొంటున్న కోర్టు సమస్యలకు ముడి పెడుతూ ఈ విధంగా మాట్లాడారు. అలెక్సీ మరణంతో అమెరికాలో ఏం జరుగుతుందో తనకు అవగాహన వచ్చిందన్నారు.

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్‌ ట్రంప్‌కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు.. మూడు రోజుల క్రితం న్యూయార్క్‌ కోర్టు మరో షాకిచ్చింది. పలు బ్యాంకులను మోసం చేసిన కేసులో 364 మిలియన్‌ డాలర్లు (రూ.3వేల కోట్లకు పైగా) ఫైన్ వేసింది. ట్రంప్ తన ఆస్తులను ఉన్నదాని కంటే ఎక్కువగా చూపించి బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేశారన్న ఆరోపణలు వెల్లువడ్డాయి. చాలా కాలం పాటు ఇలా మోసపూరితంగా బిజినెస్ లోన్స్, బీమా పొందారన్న అభియోగాలపై న్యాయస్థానం రెండున్నర నెలల పాటు విచారణ జరిపి ఈ మేరకు తీర్పునిచ్చింది.

ఇప్పటికే మరోసారి అధికారం దక్కించుకునేందుకు ఎన్నికలపై దృష్టి పెట్టిన ట్రంప్ కు.. గత కొంతకాలంగా న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో ఆయనపై నేరాభియోగాలు ఫైల్ అయ్యాయి. ఇటీవల లైంగిక వేధింపులకు సంబంధించిన పరువునష్టం కేసులో అమెరికన్‌ జర్నలిస్ట్ జీన్‌ కరోల్‌ కు 83.3 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.692.4 కోట్లు) చెల్లించాలని మాన్‌హటన్‌ ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ఇక, 2022లో ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన మోసం కేసులో ట్రంప్‌ ఆర్గనైజేషన్‌కు 1.6 మిలియన్ డాలర్ల పెనాల్టీ విధించారు.

Tags:    

Similar News