డోనాల్డ్ ట్రంప్ ఏది చేసినా ఓ స్పెషాలిటీ ఉంటుంది. చివరికి జైలెకెళ్ళి లొంగిపోయినా కూడా. ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలతో ట్రంప్ జార్జియాలోని పుల్టన్ కౌంటీ జైలుకు వెళ్ళి లొంగిపోయారు. దీంతో అమెరికా చరిత్రలో ఓ మాజీ అధ్యక్షుడు మొదటిసారిగా మగ్ షాట్ తీయించుకున్న వ్యక్తిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు.
పోలీస్ రికార్డ్ ల కోసం తీసే ఫోటోను మగ్ షాట్ అంటారు. ఇంతకు ముందు కూడా ట్రంప్ అరెస్ట్ అయ్యారు కానీ ఇలా ఎప్పుడూ మగ్ షాట్ తీయలేదు. ఆయన మీద డజనుకు పైగా ఆరోపణలు ఉన్నాయి. మగ్ షాట్ తీశారు కానీ దాన్ని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం హాట్ టాపిక్ అయింది. 2021 తర్వాత ట్విట్టర్ లో ట్రంప్ పోస్ట్ చేయడం ఇదే మొదటిసారి. నెవర్ సరేండర్ అనే క్యాప్షన్ తో ఈ పోస్ట్ పెట్టారు. దీని మీద ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ స్పందించారు. ఇది నెక్స్ట్ లెవల్ అంటూ ట్వీట్ చేశారు.మరోవైపు ట్రంప్ ఫోటోను షేర్ చేస్తూ రిపబ్లికన్ పార్టీ నేతలు ఆయనకు మద్దతును తెలుపుతున్నారు. ట్రంప్ పోస్ట్ ను కేవలం రెండు గంటల్లో 4.2 కోట్ల మంది చూశారు. రెండు లక్షల సార్లు రీట్వీట్ చేశారు.
Next-level https://t.co/E81JKWTJPS
— Elon Musk (@elonmusk) August 25, 2023