నాకు తెలుసు వారు నన్ను అరెస్ట్ చేస్తారు..ట్రంప్

Update: 2023-08-22 07:34 GMT

అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా చేసి ఓ పోస్ట్ వైరల్ నెట్టింట్లో అవుతోంది. తాను గురువారం అరెస్టు కాబోతున్నట్లు స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు ట్రంప్. ఎలక్షన్స్ ముందే ట్రంప్‏ను అరెస్టు భయం వెంటాడుతోంది. ఆయన జార్జియాలో ఎదుర్కొంటున్న ‘ఎన్నికల ఫలితాల్లో జోక్యం’ ఆరోపణలపై తాజాగా ఆయన లొంగిపోవాల్సి ఉంది. ఇదే క్రమంలో ట్రంప్ స్వయంగా ఫుల్టన్‌ కౌంటీ జైలులో సరెండర్ అయ్యి, రూ.2లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను ఇచ్చి బెయిల్‌ తీసుకోవచ్చని అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్ని ఫాని విల్లీస్‌ పర్మీషన్ ఇచ్చారు. ట్రంప్‌ బెయిల్‌ తీసుకున్న తరువాత సాక్షులను ఏ విధంగా ఇన్‎ఫ్లుయెన్స్ చేయనంత వరకు పూర్తి స్వేచ్ఛగా ఉండవచ్చు. ఇదిలా ఉంటే ట్రంప్‌పై ఇప్పటివరకు 13 ఆరోపణలు ఉన్నాయి.

"నేను గురువారం జార్జియాలోని అట్లాంటాకు వెళ్తున్నాను. నాకు తెలుసు అక్కడ రాడికల్‌ వామపక్ష డిస్ట్రిక్ట్‌ అటార్ని ఫాని విల్లీస్‌ నన్ను అరెస్టు చేస్తారు" అని ట్రంప్‌ సోషల్‌మీడియా అకౌంట్ ట్రూత్‌లో తెలిపారు. రాడికల్‌ వామపక్ష డిస్ట్రిక్ట్‌ అటార్ని దీనిని ప్రమోట్ చేస్తూ .. డబ్బు జమ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇదంతా జోబైడెన్‌ ఆధీనంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ సమన్వయం చేస్తోందని ఆరోపించారు. ఈ ఏడాది ట్రంప్‌ నాలుగు క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్నారు.అందులో ఒకటి ఈ కేసు. అంతకు ముందు ఆయనపై ఉన్న కేసుల్లోనూ ట్రంప్ బెయిల్‌ పొందారు.


Tags:    

Similar News