రష్యా నగరాలపై డ్రోన్ల భీకర దాడి.. యుద్ధం తర్వాత తొలిసారి..

Byline :  Lenin
Update: 2023-08-30 05:32 GMT

రష్యా, ఉక్రెయిన్‌ల యుద్ధం అటు సరిహద్దుల్లోనూ, ఇటు సరిహద్దుల్లోపలా హోరాహోరీగా సాగుతోంది. బుధవారం ఉదయం రష్యాలోని పలు సరిహద్దు నగరాలపై గుర్తుతెలియని డ్రోన్లు బాంబుదాడులతో విరుచుకుపడ్డాయి. రాజధాని మాస్కో శివారు ప్రాంతాల్లోనూ చిన్నచిన్న బాంబులు వేశాయి. పోస్కోవ్ నగరంలోని విమానాశ్రయం నాలుగు రవాణా విమానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రష్యా వాయుసేన వెంటనే అప్రమత్తమై డ్రోన్లను కుప్పకూల్చింది. వాటిని ఉక్రెయినే పంపిదని రష్యా అధికారులు ఆరోపిస్తున్నాయి. దాడిలో నాలుగు ఇష్యూజన్-7 విమానాలను నష్టపోయామని, ఎవరూ చనిపోలేదని పోస్కోవ్ గవర్నర్ మిఖాయిల్‌ వెడెర్నికోవ్‌ తెలిపారు. పోస్కోవ్‌ నగరం సరిహద్దుకు 600 కి.మీల దూరంలో ఉండడంతో ఆ దేశమే దాడి చేసినట్లు రష్యా భగ్గుమంటోంది.

పోస్కోవ్, ఓర్యోల్, బ్రియాంక్, రాయాజోవ్, కలూగా తదితర ప్రాంతాల్లో డ్రోన్లు దాడులు చేశాయి. 18 నెలల యుద్ధ కాలంలో రష్యా గడ్డంపై జరిగిన డ్రోన్ల దాడిలో ఇదే అతిపెద్దది. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ మాస్కో సహ పలు నగరాలపై డ్రోన్లను పంపిందని రష్యా అంటోంది. ఉక్రెయిన్‌లో పోరాడుతున్న రష్యా బలగాలపైనా ఉక్రెయిన్ భీకర డ్రోన్ల దాడులు చేసి వందల మంది సైనికులు హతమార్చింది.

Tags:    

Similar News