భార్యను చంపిన జడ్జి..ఇంట్లో ఎన్ని తుపాకులంటే...

Update: 2023-08-16 09:17 GMT

మధ్యం మత్తులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ జడ్జి. ఉన్నత పదవిలో ఉండి కూడా విచక్షణకు కోల్పోయి సభ్యసమాజం నివ్వెరపోయేలా చేశాడు. భార్య , భర్తల మధ్య వచ్చిన చిన్న గొడవ కాస్త పెద్దది కావడంతో ఆగ్రహంతో న్యాయమూర్తి హోదాలో ఉండి కూడా తన దగ్గర ఉన్న గన్‎తో భార్య గుండెలపై కాల్చి పెద్ద తప్పు చేశాడు . ఈ దారుణం అనంతరం ఇకపై నేను రేపు కోర్టుకు రాలేనని, జైలులో ఉంటాయని తన స్నేహితుడికి మెసేజ్ కూడా పంపాడు. అంతే కాదు పోలీసులకు తానే స్వయంగా ఫోన్ చేసిన సమాచారం అందించాడు.

ఈ దారుణం కాలిఫోర్నియాలో జరిగింది. ఆరెంజ్ కౌంటీ సుపీరియర్ కోర్టుకు జడ్జిగా ఉన్న 72ఏళ్ల జెఫ్రీ ఫెర్గ్యూసన్ తన భార్య షెరిల్ డిన్నర్ కోసం ఒక రెస్టారెంటుకు వెళ్లారు. అక్కడ ఏమైందో ఏమో కానీ వారిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఇద్దరూ రెస్టారెంట్‎లోనే వాగ్వాదానికి దిగారు. ఆ వివాదం కాస్త ముదిరి పెద్దదైంది. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా

గొడవ చల్లారలేదు. కోపంలో ఉన్న భార్య షెరిల్ వేలు చూపించే బదులు తుపాకీతో కాల్చేయొచ్చు కదా అని గట్టిగా అరిచింది. దీంతో మధ్యం మత్తులో ఉన్న ఫెర్గ్యూసన్ విచక్షణను కోల్పోయి తన దగ్గర ఉన్న తుపాకీని తీసి తన భార్య గుండెల్లో కాల్చాడు. ా తరువాత తన మిత్రుడికి జరిగినదంతా చెప్పీ రేపు కోర్టుకు రానని మెసేజ్ పంపాడు.

ఆ తర్వాత ఫెర్గ్యూసన్ 911కి డయల్ చేసి పోలీసులకు తాను భార్యను చంపినట్లు సమాచారాన్ని అందించాడు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు జడ్జిని అదుపులోకి తీసుకుని అతని ఇంటిని సోదా చేశారు. ఆయన ఇంట్లో మొత్తం 47 తుపాకులు, 26,000 వరకు మందుగుండు సామాన్లను పోలీసులు గుర్తించారు.అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఫెర్గ్యూసన్ బాగా తాగి ఉండటంతో నేరాన్ని అంగీకరించలేదు. ఫెర్గ్యూసన్ తన భార్యాను కావాలని చంపలేదని కోర్టులో జడ్జి తరఫున లాయర్ వాదించారు. దీనిని నేరంగా పరిగణించవద్దని కోర్టుకు చెప్పారు. దీంతో కోర్టు లాయర్ వాదనతో ఏకీభవించడమే కాదు జడ్జికి బెయిల్ కూడా మంజూరు చేసింది. మద్యం సేవంచవద్దని హితవు కూడా పలికింది.





Tags:    

Similar News