ట్విట్టర్ యూజర్లకు మస్క్ షాక్.. రోజుకు ఎన్ని ట్వీట్లు చూడొచ్చంటే..?

Update: 2023-07-02 02:32 GMT

ఎలన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి రోజుకో కొత్త రూల్ తెస్తున్నాడు. తాజాగా మరికొన్ని రూల్స్ను తీసుకొచ్చి యూజర్లకు షాక్ ఇచ్చారు. ఇక నుంచి వెరిఫైడ్ అకౌంట్ యూజర్స్ 10 వేల పోస్టులు మాత్రమే చూడొచ్చు. అన్ వెరిఫైడ్ యూజర్స్ 1000 పోస్టులు, న్యూ యూజర్స్ 500 ట్వీట్లు మాత్రమే చూడొచ్చని మస్క్ ప్రకటించారు. తొలుత వెరిఫైడ్ ఖాతాదారులకు 6000, అన్ వెరిఫైడ్ వారికి 600, కొత్త ఖాతాదారులకు 300 పోస్టుల లిమిట్ పెట్టిన ఎలన్ మస్క్ కొన్ని గంటల తర్వాత దాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాకుండా ట్విట్టర్ యూజర్లు ఇతరుల ట్వీట్లను చూడాలంటే అకౌంట్లో తప్పనిసరిగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది వరకు లాగిన్ అవ్వకపోయనా.. వెబ్ బ్రౌజర్ ద్వారా ఇతర ఖాతాదారాల ట్వీట్లను చూసే అవకాశం ఉండేది. కానీ, ఈ సౌకర్యాన్ని ట్విట్టర్ నిలిపివేసింది. అకౌంట్ లేని వారు క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్విటర్‌ నుంచి భారీ ఎత్తున డేటా చోరీ జరుగుతోందని, దాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకున్నామని మస్క్‌ చెబుతున్నారు.




Tags:    

Similar News