చైనాలోని గెంగ్డూలో జరిగే ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల ప్రారంభోత్సవానికి ఫిజీ దేశ ప్రధాని సితివేణి రబుకా హాజరుకావాల్సి ఉంది. అనంతరం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కలిసి భైఠీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓ అనూహ్య ఘటన ప్రధాని పర్యటనను రద్దు చేసింది. మొబైల్ ఫోన్ చూస్తున్న ఫిజీ ప్రధాని సితివేణి రబుకా.. కాలు జారి కింద పడ్డారు. దాంతో ఆయన తలకు బలమైన గాయం అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఫిజి రాయబార కార్యాలయం ప్రకటించింది. దీనివల్ల ఆయన చైనా పర్యటన రద్దైనట్లు తెలిపింది. ఈ మేరకు ఓ విడియోను విడుదల చేస్తూ.. ఫిజీ ప్రధాని విషయాన్ని తెలియజేశారు. ఈ వీడియోలో ప్రధాని చొక్కాపై రక్తపు మరకలు కనిపించాయి. తన ఆరోగ్యం గురించి మాట్లాడిన ప్రధాని.. భయపడాల్సిన పనిలేదని, గాయానికి కుట్లు వేశారని తెలిపారు. ఈ పర్యటన వల్ల ఫిజీ, చైనాల మధ్య దౌత్యపరమైన చర్చలు బలపడే అవకాశం ఉండేది.
An update on the deferment of my trip to China due to an injury that I sustained earlier today due to a misstep at the entrance to the New Wing of Government Buildings. pic.twitter.com/SYKrRUQPHF
— Sitiveni Rabuka (@slrabuka) July 25, 2023