Crime : లైవ్ నడుస్తుండగా తుపాకులతో స్టూడియోలోకి ఎంట్రీ.. ఆ తర్వాత..

Byline :  Krishna
Update: 2024-01-10 04:20 GMT

ఈక్వెడార్‌లో గత కొన్ని రోజులుగా దుండగులు రెచ్చిపోతున్నారు. వరుస దాడులతో ప్రజలను అధికారులను బెంబేలెత్తిస్తున్నారు. తాజాగా లైవ్ నడుస్తుండగా ఓ న్యూస్ స్టూడియోలోకి ఎంటరై బీభత్సం సృష్టించారు. రాజధాని గ్వయకిల్‌లో టీసీ టీవీ ఛానెల్‌ లైవ్‌ స్టూడియోలోకి దుండగులు ప్రవేశించారు. మాస్క్‌లు ధరించి.. తుపాకులతో వెళ్లి న్యూస్ ప్రజెంటర్ సహా అక్కడ ఉన్న ఇతర ఉద్యోగులను బెదిరించారు. వారిని కూర్చోబెట్టి తలపై తుపాకీ గురిపెట్టి బెదిరించారు. ఇదంతా సదరు ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది.

ఈ ఘటనపై అక్కడి పోలీసులు స్పందించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడి వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈక్వెడార్ ను విడిచి ఎక్కడికైన వెళ్లాలనిపిస్తోందని టీసీ టీవీ ఛానెల్ చైర్మన్ మాన్రిక్ ఆవేదన వ్యక్తం చేశారు. దుండగులు తన తలపై తుపాకీని ఎక్కుపెట్టి బెదిరించారని చెప్పారు. పోలీసులు రావడంతో తప్పించుకునేందుకు ట్రౌ చేశారని వివరించారు.

కాగా ఇటీవల జైళ్ల నుంచి ఇద్దరు డ్రగ్‌ గ్యాంగ్‌స్టర్లు తప్పించుకున్నారు. ఆ తర్వాతే దేశంలో వరుసగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వరుస దాడుల నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డేనియల్ నోబోవా కీలక ప్రకటన చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న 20 గ్యాంగులను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు. వీరంతా ఎక్కడ కన్పించినా హతమర్చాలని సైనికులను ఆదేశించారు. ఈక్వెడార్ లో శాంతిని నెలకొల్పడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు

Tags:    

Similar News