జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమైన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి(ఐఎఫ్‌ఏడీ) అధ్యక్షుడు అల్వారో లారియో.. భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రపంచ ఆహార వ్యవస్థల్లో సానుకూల మార్పులు తీసుకురాగల సామర్థ్యం భారత్ కు ఉందన్నారు.
గతేడాది ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా అనేక దేశాల్లో ఆహార కొరత ఏర్పడింది. ఆ టైంలో.. భారత్ చేసిన మేలు మరువలేనిదని.. అల్వారో లారియో అన్నారు. యుద్ధ సంక్షోభ సమయంలో భారత్.. 18 దేశాలకు 10.8 లక్షల గోధుమలను ఎగుమతి చేసి పేదల ఆకలిని తీర్చిందని కొనియాడారు. భారత్ ప్రాధాన్యతలు యూఎన్వోను పోలి ఉన్నాయని అల్వారో అన్నారు. పేదలకు పౌష్టికాహారం అందించాలంటే అది తృణధాన్యాతోనే సాధ్యమని తెలిపారు.