హ్యాట్సాఫ్.. చైనీయుడి కోసం భారత్ సాహసోపేత ఆపరేషన్‌

Update: 2023-08-17 07:23 GMT

చైనా వ్యక్తి కోసం ఇండియన్ కోస్ట్గార్డ్ సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. ప్రతికూల వాతావరణంలోనూ ముందుకు సాగి అతడి ప్రాణాలను కాపాడింది. పనామా దేశ జెండాతో ఉన్న ఎంవీ డాంగ్‌ ఫాంగ్‌ కాన్‌ టాన్‌ నంబర్‌ 2 రీసెర్చ్‌ షిప్ చైనా నుంచి అరేబియా సముద్రం మీదుగా యూఈఏ వెళ్తోంది. ఈ షిప్లో పనిచేస్తున్న యిన్‌ వీగ్‌యాంగ్‌ బుధవారం రాత్రి ఛాతీ నొప్పితో విలవిల్లాడారు. దీంతో సిబ్బంది సమీప తీర ప్రాంతమైన ముంబయిలోని మారిటైమ్‌ రెస్క్యూ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు ఎమర్జెన్సీ మెస్సేజ్ పంపారు.




 


ఇండియన్ కోస్ట్గార్డ్ టీం వెంటనే అప్రమత్తమై అతడిని కాపాడేందుకు ALH MK-3 హెలికాప్టర్‌తో బయల్దేరారు. ఆ షిప్ తీరానికి 200 కిలోమీటర్ల దూరంంలో ఉండగా.. వాతావరణం కూడా ప్రతికూలంగా మారింది. అయినా కోస్ట్గార్డ్ టీం చిమ్మచీకట్లో ధైర్యంగా ముందుకు సాగి అతడిని ఎయిర్ లిఫ్ట్ చేసింది. అతడికి హెలీకాఫ్టర్లోనే ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు రక్షణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇండియన్ కోస్ట్గార్డ్ టీంను అందరూ అభినందిస్తున్నారు.




 





 




Tags:    

Similar News