Singapore president : సింగపూర్‌ అధ్యక్షుడిగా షణ్ముగరత్నం

Byline :  Aruna
Update: 2023-09-02 03:06 GMT

సింగపూర్ 9వ అధ్యక్ష ఎన్నికలు ఆధ్యంతం ఎంతో ఆసక్తిగా సాగాయి. శుక్రవారం జరిగిన ఓటింగ్ ప్రక్రియలో ప్రజలు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్థుల్లో భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. సింగపూర్ ప్రజలు షణ్ముగరత్నంకు బ్రహ్మరథం పట్టారు. దీంతో సింగపూర్‏కు మూడో భారత సంతతికి చెందిన వ్యక్తి ప్రెసిడెంట్ అవుతున్నారు. గతంలో సింగపూర్‎కు ఇద్దరు భారత సంతతికి చెందిన వారు అధ్యక్షులుగా తమ విలువైన సేవలను అందించారు.

ఈ ఎలక్షన్లలో షణ్ముగరత్నంతో పాటు ఇద్దరు చైనా సంతతికి చెందిన అభ్యర్థులు పోటీ చేశారు. వీరిద్దరిని చిత్తు చిత్తుగా ఓటిండి షణ్ముగరత్నం భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల ముందు నుంచే సింగపూర్ ప్రజలు తనకే ఓటు వేస్తారని, అధ్యక్ష పీఠంపై కూర్చోబెడతారని షణ్ముగరత్నం ధీమాను వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో షణ్ముగరత్నానికి 70.4 శాతం ఓట్లు వచ్చాయి. ఇక చైనా సంతతికి చెందిన ప్రత్యర్థులు కోక్‌ సోంగ్‌కు 15.7 %, టాన్‌ కిన్‌ లియన్‌కు 13.88 % ఓట్లను మాత్రమే ప్రజలు వేశారు. ఈ సెప్టెంబర్ 13తో ప్రస్తుతం సింగపూర్‎కు అధ్యక్షురాలిగా కొనసాగుతున్న హలీమా యాకోబ్ ఆరేళ్ల పాలన ముగియనుంది. ఈమె సింగపూర్ దేశానికి ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్.ఈమె పదవీకాలం ముగియనుండటంతో 9వ అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్లలో గెలుపొందిన షణ్ముగరత్నం సెప్టెంబర్ 13 తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

భారత సంతతికి చెందిన ధర్మాన్ షణ్ముగరత్నం సింగపూర్‌లో జన్మించారు. 2001లో పాలిటిక్స్‎లోకి ఎంట్రీ ఇచ్చారు. రెండు దశాబ్దాల పాటు పీపుల్స్ యాక్షన్ పార్టీలో మంత్రిగా పలుమార్లు బాధ్యతలు నిర్వహించారు. 2011- 2019 మధ్యలో సింగపూర్ కు డిప్యూటీ ప్రధాని‎గా కూడా పని చేశారు. అధ్యక్ష ఎన్నికల బరిలో నిల్చునేందుకు జులైలో తన పదవులు అన్నింటికీ రాజీనామా చేశారు. అధ్యక్షుడిగా విజయాన్ని సాధించారు.



Tags:    

Similar News