మద్యం మత్తులో ఉన్న మహిళను రూమ్‌కి తీసుకెళ్లి...

Update: 2023-06-18 12:01 GMT

భారత సంతతి స్టూడెంట్ ఇంగ్లాండ్లో దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న మహిళను ఫ్లాట్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఏడాది క్రితం జరగ్గా.. తాజాగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. భారత సంతతి విద్యార్థి ప్రీత్ వికల్ సౌత్ వేల్స్ లోని కార్డిఫ్ ప్రాంతంలో ఉంటున్నాడు. గత ఏడాది జూన్‌ నెలలో అతడు నైట్‌ క్లబ్‌కు వెళ్లాడు. అదే సమయంలో ఓ మహిళ కూడా తన గ్యాంగ్తో కలిసి క్లబ్‌కు వెళ్లింది. ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు.

క్లబ్‌లో ఆ మహిళ మందు ఎక్కువగా తాగింది. ఈ క్రమంలో వికిల్ ఆమెను తన ఫ్లాట్కు తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ మహిళను వికల్ తన చేతుల్లో ఎత్తుకుని తీసుకెళ్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రీత్ వికల్‌ను గుర్తించి అరెస్ట్ చేశామని సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. ‘‘కార్డిఫ్‌లో ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి. ప్రీత్‌ వికల్‌ లాంటి ప్రమాదకర వ్యక్తుల వల్ల ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. ఓ వ్యూహం ప్రకారం మహిళను ఆమె స్నేహితుల నుంచి తప్పించి దారుణానికి ఒడిగట్టాడు’’ అని పోలీసులు వివరించారు.

Tags:    

Similar News