Israel: ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య యుద్ధం.. 5వేల రాకెట్లతో భీకర దాడులు
ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య యుద్దం నెలకొంది. ఇజ్రాయెల్పై ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ 5వేలపైగా రాకెట్లతో భీకర దాడికి దిగింది. గాజా స్ట్రిప్ నుంచి ఈ దాడులు జరిగాయి. ఈ క్రమంలో అలర్ట్ అయిన ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడులకు దిగింది. అదేవిధంగా యుద్ధ సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తంగా చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. హమాస్ సైనికుల దాడిలో ఓ మహిళ మృతి చెందగా.. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్పై సైనికులు ఆపరేషన్ను ప్రారభించామని వింగ్ హెడ్ మొహమ్మద్ డెయిఫ్ ప్రకటించాడు. ‘ఆపరేషన్ ఆల్-అక్సా స్ట్రామ్’ ఈ ఆపరేషన్ చేపట్టామని.. ఈ ఉదయం ఇజ్రాయెల్ పై 5వేలకు పైగా మిస్సైల్స్ ప్రయోగించినట్లు తెలిపారు. ‘‘ఇజ్రాయెల్ అరాచకాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాం. పాలస్తీనావాసులు ఎక్కడున్నా సరే బయటకు వచ్చి పోరాడండి’’ అని డెయిఫ్ పిలుపునిచ్చాడు.
మరోవైపు పెద్ద సంఖ్యలో హమాస్ సైనికులు గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హమాస్ సైనికులు సరిహద్దుల్లోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి దాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ - హమాస్ సైనికుల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. అయితే పలువురు ఇజ్రాయెల్ వాసులను హమాస్ బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ దాడులకు హమాస్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
HUGE ⚡️Israel declares WAR along GAZA STRIP
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 7, 2023
In a coordinated attack, At least 4 Groups (aprox 40-50) Palestinian Hamas Fighters have crossed the Border into Southern Israeli under cover of Rocket Fire over the last hour. Gliders and boats also used to enter Israel
Isreal has… pic.twitter.com/nWyUSZhN6n