Israel Pm Benjamin Netanyahu : యుద్ధాన్ని మేం మొదలపెట్టలేదు కానీ ముగించేది మేమే : ఇజ్రాయెల్ ప్రధాని

Byline :  Krishna
Update: 2023-10-10 01:59 GMT

ఇజ్రాయెల్ - పాలస్తినా మధ్య యద్ధం కొనసాగుతోంది. గాజాపై ఇజ్రాయెల్ తన దాడులను పెంచింది. యుద్ధం మొదలైన మూడురోజుల్లోనే హమాస్ ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ దాడుల్లో ఇరువైపుల భారీ ప్రాణ నష్టం జరుగుతోంది. గాజా స్ట్రిప్ కు కరెంట్, ఆహార సరాఫరాలను ఇజ్రాయెల్ నిలిపేసింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.

తమ దేశంపై దాడి చేసి హమాస్‌ చారిత్రక తప్పిదం చేసిందని నెతన్యాహు అన్నారు. యుద్ధాన్ని ఇజ్రాయెల్‌ మొదలుపెట్టలేదు కానీ ముగించేది మాత్రమ మేమే అంటూ హెచ్చరించారు. యుద్దాన్ని తాము ఏమాత్రం కోరుకోలేదని చెప్పారు. కానీ తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధం చేయాల్సి వస్తుందన్నారు. తమ ప్రతిదాడి హమాస్‌తోపాటు, ఇజ్రాయెల్‌ శత్రు దేశాలకు దశాబ్దాలపాటు గుర్తుండిపోతుందని నెతన్యాహు హెచ్చరించారు. హమాస్‌ కూడా ఐసిస్‌ లాంటి ఉగ్రవాద సంస్థే అని.. ప్రజలంతా ఏకమై దాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌ గెలిస్తే నాగరిక ప్రపంచం మొత్తం గెలిచినట్లేనన్నారు.


Tags:    

Similar News