ఖలిస్థాన్‌కు జై కొట్టలేదని..భారతీయ విద్యార్థిపై రాడ్డులతో దాడి
ఖలిస్థాన్ అనుకూల వాదులు మరోసారి రెచ్చిపోయారు. ఖలిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయాలదే కారణంతో ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థిపై దాడి చేశారు. విచక్షణ రహితంగా రాడ్డులతో కొట్టారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన విద్యార్థి ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
భారతీయ విద్యార్థి అక్కడే చదువుకుంటూ ఖాలీ సమయంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం కారు తీస్తుండగా.. అక్కడికి వచ్చిన ఐదుగురు వ్యక్తులు అతడిని ఖలిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయాలని కోరారు. వారి డిమాండ్‌ను అతడు నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారు. మొదట ఒకరు విద్యార్థి చెంపై కొట్టగా, తర్వాత మిగతా వారు ఇనుపరాడ్లతో దాడి చేశారు.
ఖలిస్థాన్ అనుకూల వాదులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం తొలిసారి కాదు. ఇటీవల శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.దౌత్యకార్యాలయానికి నిప్పుపెట్టారు. మార్చిలో కూడా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయంపై దాడి చేశారు. 2023 ఫిబ్రవరిలో కొందరు ఖలిస్థాన్ అనుకూల వాదులు భారత కాన్సులేట్ కార్యాలయం గోడకు ఖలిస్థాన్ జెండా అతికించారు. జనవరి 23న మెల్‌బోర్డ్ నగరంలోని అల్బర్డ్ పార్క్ దగ్గర్లోని ఇస్కాన్ ఆలయం గోడలను ధ్వంసం చేశారు. దీనికి ముందు జనవరి 16న విక్టోరియాలోని శ్రీ శివవిష్ణు దేవాలయంలోనూ ఇదే తరహా చర్యలకు పాల్పడ్డారు. జనవరి 12న మెల్‌బోర్న్‌లోని స్వామినారాయణ దేవాలయం గోడలపై ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు రాశారు.