వామ్మో ఎంత పెద్దదో... మీరెప్పుడూ చూసి ఉండరు!

Update: 2023-09-02 10:24 GMT

మనిషి ఐదారు అడుగులు ఉంటాడు. పొడవైనా, అడ్డమైనా ఏదైనా సరే హద్దులో ఉంటేనే అందం చందం. హద్దు మీరితే బీభత్సమే. మానవజాతిలో ఏడు అడుగుల మనుషులు ఉన్నట్టే జంతువుల జాతిలో మతిమీరిన ప్రాణులు ఉంటాయి. ముఖ్యంగా సరీసృపాల్లో మనం ఊహించని జీవులు కనిపిస్తాయి. అనకొండ పాముల్లో 35 అడుగులవి కూడా ఉన్నాయంటారు. మొసళ్లలోనూ భారీవి ఉన్నాయి. అలాంటి ఓ మకరం అమెరికాలో మిసిసిపీ రాష్ట్రంలో దొరికింది.




 


చూడటానికి డైనోసార్‌లా భయంకరంగా ఉన్న ఈ మొసలి వేటగాళ్లు నానా తిప్పలూ పడి పట్టుకున్నారు. మిసిసిపీ రాష్ట్రంలో ఇంత పెద్ద మొసలి దొరకడం ఇదే తొలిసారి. దీని పొడవు 14 అడుగుల మూడు అంగుళాలు (4.4 మీటర్లు), బరువు 364 కేజీలు. గత నెల 26న వేటగాళ్లకు ఇది కనిపించింది. దీన్ని చంపడానికి ఏడు గంటలు కష్టపడ్డారు. నదిలో పదిరోజుల పాటు వేట సాగించాక ఓ మడుగులో ఇది కనిపించింది. మిసిసిపీలో ప్రభుత్వ అనుమతి తీసుకుని మొసళ్లు చంపొచ్చు. అమెరికాలో దొరికిన అతిపెద్ద మొసలు పొడవు 15 అడుగులు 9 అంగుళాలు. 2014లో అలబామాలో దొరికిన ఆ జీవి బరువు 459 కేజీలు. ఆడ మొసళ్లకళ్నా మగవి భారీగా పెరుగుతాయి.




 


Tags:    

Similar News