జర్నీలో తూగుతూ పక్క మనిషిపై వాలిపోతున్నారా? ఇది చూస్తే చచ్చినా అలా చేయరు.. వీడియో వైరల్..
ప్రయాణంలో చిన్నపాటి కునుకు మామూలే. నిద్ర తక్కువై కొందరు, చల్లగాలి వీస్తోందని కొందరు ఏవేవో కారణాలతో లోకం మరిచి మైమరచి తూగుతుంటారు. పక్కన కూర్చున్న మనుషుల భుజాలమీద వాలిపోతుంటారు. తట్టి లేపితే తలవిదిలించుకుని కాసేపు మెలకువలో ఉంటారు. తర్వాత షరా మామూలే. మళ్లీ తూగడం, భుజాల మీద వాలిపోవడం, నిద్ర ఎక్కువతై ఒడిలోనూ బజ్జోవడం చూస్తుటాం. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖం ఎరగదు అనే మాట అలా పుట్టుకొచ్చిందే. నిద్రపోయే వాళ్ల సంగతి ఎలా ఉన్నా, వాళ్ల బరువు మోయలేక పక్కనున్న ప్రయాణికులు యాతన పడుతుంటారు. కొందరు సున్నితంగా తట్టి లేపుతారు. కొందరు విసుక్కుంటారు. కోపం ముక్కుమీదే ఉన్నవాళ్లయితే ఈ వీడియోలోని దుర్మార్గుడిగా వాయిగొడతారు.
అమెరికాలోని న్యూయార్క్ సబ్‌వే రైల్లో ఈ ఘోరం జరిగింది. ఫారెస్ట్ ఎవెన్యూ 71 స్టాప్ వద్ద సహ ప్రయాణికుడు తూగుతూ మాటిమాటికీ తన భుజంపై వాలిపోతున్నాడని ఓ మనిషి ఘోరంగా దాడి చేశాడు. మోచేత్తో మూడుసార్లు బలంగా కుమ్మి వదిలాడు. నిద్రమనిషి కిక్కరుమనకుండా దెబ్బలు తిన్నాడు. కాసేపు దిమ్మతిరిగి చలనం లేకుండా ఉండిపోయాడు. ఎన్నిసార్లు చెప్పిన మీద పడడం ఆపడ లేదని బండబూతులు తిడుతూ దాడి చేశాడు కోపిష్టి. ‘‘ఎక్కడికైనా వెళ్లి నిద్రపోయి చావు..ఫ..’’ అని మాటల్లో రాయలేని బూతులు తిట్టాడు. దెబ్బతిన్న మనిషి స్నేహితుడు అతనిపై ఎదురుదాడి చేశాడు. ఇద్దరూ భీకరంగా కొట్టుకున్నారు. ప్రయాణికులు భయంతో పారిపోయారు. బాధితుడు, అతని స్నేహితుడు స్టేషన్లో దిగిపోయారని, కొట్టినవాడు చక్కగా ప్రయాణం పూర్తి చేశాడని పోలీసులు చెప్పారు.
New York man elbows another passenger on the subway #subwaycreatures #nyc #frailego pic.twitter.com/N6KX6ltBIz
— Rama (@EyesWitness00) August 24, 2023