2800 కోట్ల లాట‌రీ గెలిచిన వ్యక్తి.. చివర్లో బిగ్ ట్విస్ట్

Byline :  Krishna
Update: 2024-02-20 08:53 GMT

అమెరికాలోని ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అది మామూలు అదృష్టం కాదు.. ఏకంగా అతడిని 2800 కోట్లు వరించింది. జాన్స్ చీక్స్ అనే వ్యక్తి పవర్ బాల్ అండ్ డీసీ లాటరీ గెలిచాడు. 2023 జనవరి 6న అతడు లాటరీ కొన్నాడు. అయితే డ్రాలో అతడు గెలిచినట్లు డీసీ లాటరీ వెబ్సైట్లో కన్పించింది. దీంతో అతడి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. అయితే అప్పుడే కంపెనీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. జాన్ చీక్స్ లాటరీ గెలిచిన వార్తను డీసీ లాటరీ కంపెనీ ఖండించింది.

అతడు ఎటువంటి లాటరీ గెలవలేడని పవర్ బాల్ అండ్ డీసీ లాటరీ కంపెనీ చెప్పింది. పొరపాటున వెబ్సైట్లో ఆ నెంబర్ పబ్లిష్ అయ్యిందని వాదించింది. దీంతో చీక్స్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. కంపెనీపై న్యాయపోరాటానికి దిగాడు. తనకు నష్టపరిహారం ఇవ్వాలని కేసు వేశాడు. కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. భావోద్వేగాలతో ఆడుకుందని ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని కోర్టును కోరాడు. ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News