Afghanistan Earthquake: ఆఫ్ఘన్ అతలాకుతలం.. మరోసారి భారీ భూకంపం

By :  Bharath
Update: 2023-10-15 11:20 GMT

ఆఫ్ఘనిస్తాన్ ను భూకంపాలు వదలడంలేదు. గత వారం నుంచి భారీ భూకంపాలు ఆఫ్ఘనిస్తాన్‌ ను అతలకుతలం చేస్తున్నాయి. అక్టోబర్ 7న గంటల వ్యవధిలో భారీ భూకంపాలు రావడంతో.. దాదాపు 2 వేల మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నెల 11న కూడా మరోసారి భారీ భూకంపం వచ్చి.. ఆఫ్ఘన్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. తాజాగా మరో భూకంపం వచ్చింది. ఆదివారం పశ్చిమ ఆఫ్ఘన్ లో 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. యూఎస్, జియోలాజికల్ సర్వే ప్రకారం, తాజా భూకంప కేంద్రం హెరాత్ నగరానికి వెలుపల 34 కిలోమీటర్లు దూరంలో, ఉపరితలం నుండి దాదాపు 8 కిలోమీటర్లు దిగువన భూమి కంపించింది. అయితే ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం జరిగిందా లేదా అనే విషయంపై క్లారిటా రావాల్సి ఉంది.

Tags:    

Similar News