ఒల్లోనే బిడ్డ.. ఇల్లంతా వెతికిన తల్లి.. ఏమైందంటే..?

Update: 2023-06-11 10:19 GMT

మొబైల్ ఫోన్.. ఇది లేకుండా నేటి మనుషులు ఉండడం కష్టం. అంతలా మనిషి జీవితంలో భాగమైపోయింది. ఏ పనిచేస్తున్న మొబైల్ చేతిలో ఉండాల్సిందే. మహిళలు చేతిలో ఫోన్ చూస్తూనే వంట, ఇంట్లో పనులు చేస్తుంటారు. తాజాగా ఓ మహిళ చేసిన పని నవ్వులు పూయిస్తుంది. సదరు మహిళ ఇంట్లోని హాల్లో సోఫాలో కూర్చుని ఉంది. ఆమె ఎదురుగా బేబీ వాకర్ ఉంది. ఆమె మొబైల్ బ్రౌజ్ చేస్తూ బేబీ వాకర్ను తన కాలుతో అటూ ఇటూ ఊపుతోంది.

కొద్దిసేపటి తరువాత ఆమె మొబైల్ చూడటం ఆపి బేబీ వాకర్ వైపు చూసింది. వాకర్లో తన బిడ్డ కనిపించకపోవడంతో ఆమె కంగారు పడింది. వెంటనే లేచి బిడ్డ కోసం ఇల్లంత వెతకడం మొదలుపెట్టింది. చివరకు ఆమె చంకలో చూసుకుని షాకైంది. ఎందుకంటే ఆమె బిడ్డ తన చంకలోనే ఉన్నాడు. తాను చేసిన పని తనకే నవ్వు తెప్పించింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైంది.

ఈ వీడియోను ఫిగెన్ అనే మహిళ ట్విట్టర్లో షేర్ చేసింది. దానికి దేవుడా నా బిడ్డ ఎక్కడున్నాడు అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మొబైల్కు అడిక్ట్ అయితే ఇలాగే ఉటుంది. దీన్నే మొబైల్ వాడకం వల్ల వచ్చే మతిమరుపు అంటారు. మేకపిల్లను చంకనేసుకుని ఊరంతా తిరిగినట్టుంది అనే ఈమె వాలకం అన్నట్లుగా ఉంది అని రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 



Tags:    

Similar News