ప్రధాని మోదీ రెండు రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన ప్యారిస్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఆ దేశ ప్రధాని ఎలిజబెత్ బార్న్ ఘనస్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను మోదీ ట్వీట్ చేశారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ - ఫ్రాన్స్‌ల పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించేలా కృషి చేస్తానని చెప్పారు.
ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన వేళ మోదీ ఈ పర్యటన చేపడుతున్నారు. మోదీ తొలుత ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్‌తో సమావేశమవుతారు. అనంతరం సెనేట్‌ను సందర్శించి.. సెనేట్ అధ్యక్షుడు గెరాడ్ లార్చర్‌తో భేటీ అవుతారు. రాత్రి 11 గంటల సమయంలో.. ప్రవాస భారతీయుల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఎలీసీ ప్యాలెస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ఏర్పాటు చేసిన ప్రైవేట్ డిన్నర్లో పాల్గొననున్నారు. ఇక మెక్రాన్ ఆహ్వానం మేరకు ఆ దేశ ‘నేషనల్ డే’ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత త్రివిధ దళాలు కూడా భాగస్వామ్యం కానున్నాయి.
Atterri à Paris. Je me réjouis de pouvoir renforcer la coopération entre l'Inde et la France au cours de cette visite. Mes différents programmes comprennent une interaction avec la communauté indienne plus tard dans la soirée. pic.twitter.com/XM5j2xhEs6
— Narendra Modi (@narendramodi) July 13, 2023