శిథిలాలు.. శవాల గుట్టలు.. మొరాకోలో హృదయ విదారక దృశ్యాలు.. (వీడియో)

Byline :  Kiran
Update: 2023-09-10 06:44 GMT

మొరాకోను కుదిపేసిన తీవ్ర భూకంపం పెను విషాదం మిగిల్చింది. కూలిపోయిన భవనాలు.. శకలాల కింద నుంచి వెలికితీసిన మృతదేహాలతో ఎటుచూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం ఉదయానికి భూకంపం కారణంగా చనిపోయిన వారి సంఖ్య 2 వేలు దాటింది. మృతుల్లో పలువురు విదేశీయులు కూడా ఉన్నారు.

భూకంపం కారణంగా 1,404 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 11.11 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.8గా నమోదైంది. భారీ భూకంపం కారణంగా మారకేష్‌తో పాటు దాని చుట్టుపక్కల 5 ప్రావిన్సుల్లో పెను విధ్వంసం చోటు చేసుకుంది. ప్రకంపనల ధాటికి భారీ భవనాలు కుప్పకూలాయి. హై అట్లాస్‌ పర్వత ప్రాంతంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ మసీదు కటూబియాకు తీవ్ర నష్టం వాటిల్లింది. భూకంపం ధాటికి అనవాళ్లు కోల్పోయిన మొరాకో పునర్నిర్మాణానికి ఏండ్ల సమయం పడుతుందని రెడ్ క్రాస్ సొసైటీ అంటోంది.

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలు తొలగించేకొద్దీ శవాలు బయటపడుతున్నాయి. మరికొందరు తీవ్ర గాయాలతో శకలాల కింద చిక్కుకుపోయిన ఉన్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసి హాస్పిటళ్లకు తరలిస్తున్నారు. పునరావాసం కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. భూకంప ప్రభావిత ప్రాంత ప్రజలు వరుసగా రెండో రోజు వీధుల్లోనే గడిపారు. శిథిల భవనాల నుంచి వీలైనన్ని నిత్యావసరాలను ప్రజలు తమతో పాటు తెచ్చుకుంటున్నారు. కింగ్‌ మహమ్మద్‌-6 మొరాకోలో మూడు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించారు. మరో వైపు మారకేష్‌ ఎయిర్‌ పోర్టు ప్యాసింజర్లతో నిండిపోయింది. దేశం విడిచి వెళ్లేందుకు పలువురు విమానాశ్రయానికి చేరుకున్నారు.

Pray for Morocco.#Morocco #deprem #المغرب #مراكش #moroccoearthquake #earthquake #moroccosismo #strongearthquake #marrakesh #marrakech #Marrakesh #زلزال #sismos #sismo pic.twitter.com/4xHw6Em4T6

Tags:    

Similar News