డ్రోన్లతో విరుచుపగుతున్న ఉక్రెయిన్.. విమానాల నిలిపివేత

Update: 2023-08-23 07:14 GMT

రష్యాపై డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది ఉక్రెయిన్. ఈ దాడులను పుతిన్‌ (Putin) సేనలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. తాజాగా మాస్కో సమీపంలో, సరిహద్దుల్లోని బ్రియాన్‌స్క్‌ ప్రాంతంలోకి మంగళవారం నాలుగు ఉక్రెయిన్‌ డ్రోన్లు దూసుకురాగా.. రష్యా సైన్యం వాటిని కూల్చేసింది.ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా మాస్కోలోని నాలుగు ప్రధాన ఎయిర్‌పోర్టు (Moscow Airports)ల్లో విమానాల రాకపోకలను (Flights suspended) అధికారులు నిలిపివేసినట్లు రష్యా అధికారిక మీడియా వెల్లడించింది.




 


గగనతలాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడటంతో అప్రమత్తమై ముందు జాగ్రత్తగా వ్నుకోవో, షెరెమెట్యెవో, డొమోడెడెవో, జుకోవ్‌స్కీ ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలను నిలిపివేశామని రష్యా అధికారి చెప్పినట్లు సదరు మీడియా కథనం పేర్కొంది. దీంతో దాదాపు 50 విమానాల రాకపోకలపై ఈ ప్రభావం పడింది. మరోవైపు, ఉక్రెయిన్‌ జరిపిన తాజా డ్రోన్‌ దాడుల్లో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని రష్యా రక్షణ శాఖ ధ్రువీకరించింది.




 


గత కొద్ది రోజులుగా రష్యా భూభాగాలను లక్ష్యంగా చేసుకుని తరచూ డ్రోన్‌ దాడులు జరుగుతున్నాయి. గత ఆదివారం కూడా ఉక్రెయిన్‌కు కెందిన ఓ డ్రోన్‌ రష్యాలోని కుర్స్క్‌ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో రైల్వే స్టేషన్‌ పైకప్పు కూలి ఐదుగురు గాయపడ్డారు. గతవారం మాస్కోలో అధ్యక్ష భవనానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది.






 


Tags:    

Similar News