ఈజిప్టులో ‘మమ్మీ’ తుపాను.. వామ్మో.. వీడియో

Update: 2023-06-03 06:18 GMT

ఈజిప్టు అంటే మమ్మలు, మమ్మీలు అంటే ఈజిప్టు. ప్రాచీనకాలం ఈజిప్టు ఫారో చక్రవర్తుల కథలతో హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చినా ‘మమ్మీ’ సిరీస్ చిత్రాలే చాలమందికి నచ్చాయి. ఆ పిరమిడ్లు, దెయ్యాలు, పురుగులు, నానా రకరాల వింతజీవులను ప్రపంచం అవాక్కై చూసింది. సినిమాల్లోని ఇసుక తుపానులు కూడా బీభత్సమే. ఇది సినిమాలకు మాత్రమే పరిమితం కాదు. పిడమిడ్లు ఎడాది ప్రాంతంలో ఉండడంతో తరచూ అక్కడ ఇసుక తుపాన్లు విరచుకుపడుతుంటాయి.

తాజాగా ‘మమ్మీ’ తుపాను తలపించే ఇసుక తుపాను ఈజిప్టు రాజధాని కైరో విరుచుకుపడింది. దానితోపాటు పెనుగాలులు కూడా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు. కరెంటు స్తంభాలు, చెట్లు, హోర్డింగులు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల వర్షం కూడా పడుతోంది. నగరంలో జనజీవనం స్తంభించింది. జనం ఇళ్లనుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. అందరూ మాస్కులు పెట్టుకోవాలి, బయటికి రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ‘మమ్మీ’ తుపాను వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇసుకతోపాటు దెయ్యాలు కూడా వస్తాయని, కైరో వాసులకు మంచి అవకాశమని జనం కామెంట్లు పెడుతున్నారు.




Tags:    

Similar News