Mexico :మెక్సికోలో 1000ఏళ్ల నాటి ఏలియన్స్ అవశేషాలు.

Byline :  Kiran
Update: 2023-09-13 12:35 GMT

విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయా.. ఉంటే అవి ఎలా ఉంటాయి.. అనే చర్చ ఎప్పుడూ ఆసక్తికరమే. అంతరిక్షంలో భూమి లాంటి గ్రహాలు ఉన్నాయా..? అక్కడ జీవం ఉందా.. గ్రహాంతరవాసులు ఉన్నాయా అనే అంశంపై శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసుల గురించి కచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ.. ఏదో ఒక గ్రహంపై జీవిస్తున్నారనేదే అందరి నమ్మకం. వాటిని మరింత బలపరుస్తూ అందరినీ షాక్కు గురిచేసే ఘటన మెక్సికోలో జరిగింది.


 



Mexicoపార్లమెంటులో శాస్త్రవేత్తలు ఇద్దరు గ్రహాంతరవాసుల మృతదేహాలను ప్రపంచం ముందు ఉంచడం కలకలం రేపుతోంది. దీనిపై జర్నలిస్ట్‌, యూఫాలజిస్ట్‌ జైమే మోస్సాన్‌ మాట్లాడుతూ.. ‘‘యూఎఫ్‌ఓ ధ్వంసం కావటం వల్ల ఈ రెండు ఏలియన్ల శరీర భాగాలు దొరకలేదు. ఇవి డయాటమ్‌ గనుల్లో దొరికాయి. ఎక్కువ కాలం అక్కడ ఉండటం వల్ల అవి శిలాజాలుగా మారాయి. రేడియో కార్బన్‌ డేటింగ్‌ ద్వారా అవి 1000 ఏళ్ల పురాతనమైనవని అంచనా వేశాం.పెరూలోని కుస్కోనుంచి వీటిని తీసుకొచ్చాం’’ అని చెప్పారు.




 


ఈ మృతదేహాల డీఎన్‌ఏలో 30 శాతం భూమిపై జీవులతో సంబంధం లేకుండా ఉందని తేలినట్లు మోస్సాన్ చెప్పారు. ‘‘ఓ ఏలియన్‌ కడుపులో గుడ్లు ఉన్నాయి. ఈ రెండిటి శరీరాల్లో అత్యంత అరుదైన లోహాలు ఉన్నాయి’’అని అన్నారు. ప్రస్తుతం రెండు ఏలియన్స్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది అవి ఏలియన్స్‌వే అని అంటే.. మరికొంతమంది అదంతా ఫేక్‌ అని కొట్టిపారేస్తున్నారు.




Tags:    

Similar News