New Zealand Massive Earthquake : న్యూజిలాండ్‌లో భారీ భూకంపం..వణికిపోయిన అక్లాండ్

Byline :  Aruna
Update: 2023-09-20 05:30 GMT

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని ప్రభుత్వ భూకంప మానిటర్ జియో నెట్ తెలిపింది. బుధవారం ఉదయం 9.14 గంటలకు 11 కిలో మీటర్ల ఫోకల్ డెప్త్ వద్ద భూమి కంపించింది.

ఈ భారీ భూకంపంతో సౌత్ ఐల్యాండ్‎లోని గెరాల్డిన్ ప్రాంతం ఒక్కసారిగా వణికిపోయింది. అయితే ఎలాంటి సునామీ ప్రమాదం లేదని న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తాజాగా ప్రకటించింది. దీంతో ప్రజలు ఊపిరితీసుకున్నట్లైంది. ప్రథమిక నివేదికల ప్రకారం, భారీ భూకంపం వచ్చినప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కడా నమోదు కాలేదు. ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటివరకు సంభవించిన భూకంపాలతో పోలిస్తే ఇది అతిపెద్ద భూకంపంగా రికార్డుకెక్కింది. ఇదిలా ఉండగా 2011లో రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దక్షిణ ద్వీపంలోని క్రైస్ట్‌చర్చ్‌లో 185 మంది మృతి చెందారు.




Tags:    

Similar News