Sam Altman : ఒక్కటైనా మగ జంట.. బాయ్ ఫ్రెండ్ ఆలివర్ మల్హెరిన్ను పెళ్లాడిన ఆల్ట్మన్
OpenAI వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్మాన్ (Sam Altman) తన స్నేహితుడు ఆలివర్ ముల్హెరిన్ను వివాహం చేసుకున్నారు. హవాయ్ నగరంలోని సముద్రపు ఒడ్డున వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. ఈ వివాహ కార్యక్రమంలో వారిద్దరూ తెల్లటి చొక్కా, లేత గోధుమ రంగు ప్యాంటు ధరించారు.
మల్హెరిన్ ఆస్ట్రేలియాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆలివర్ ముల్హెరిన్ మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. . ఆ తర్వాత రెండేళ్ల పాటు మెటాలో పనిచేశారు. వీరిద్దరూ వారి బంధం గురించి ఎక్కడ బయటపెట్టలేదు. 2023లో న్యూయార్క్ మ్యాగజైన్తో ఇంటర్వ్యూలో మాత్రం తామిద్దమూ శాన్ఫ్రాన్సిస్కోలోని రష్యన్ హిల్లో కలిసి ఉంటున్నంటూ వెల్లడించారు.
వీరి వివాహానికి సాంకేతిక రంగానికి చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వీటిలో జెఫ్ బెజోస్ కాబోయే భార్య లారెన్ సాంచెజ్, అలెగ్జాండర్ వాంగ్, షెర్విన్ పిషెవర్, జేన్ మతోషి, అడ్రియన్ ఔన్ పేర్లు ఉన్నారు. సామ్ ఆల్ట్మాన్ జీవిత భాగస్వామైన ఆలివర్ ముల్హెరిన్ను ముద్దుగా ఆలీ కూడా అని పిలుస్తారు. సామ్తో అతని స్నేహం చాలా కాలంగా కొనసాగుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) రంగంలో ఆలివర్ ముల్హెరిన్ మంచి నైపుణ్యం ఉంది. ఆలివర్ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు వివిధ AI ప్రాజెక్ట్లలో పనిచేశాడు. ఇక గతేడాది వైట్హౌస్లో ప్రధాని మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో వారిద్దరూ పాల్గొన్నారు.