రైతు ఉద్యమానికి సంబంధించి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి జర్నలిస్టుల ఖాతాలను బ్లాక్ చేయాలని భారత్ నుంచి తమకు అనేక అభ్యర్థనలు వచ్చాయని ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ చేసిన ప్రకటనపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ యూట్యూబ్ షో 'బ్రేకింగ్ పాయింట్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఆరోపణపై స్పందిస్తూ.. జాక్ డోర్సీ చేసిన కామెంట్స్ పచ్చి అబద్ధమని చెప్పారు. బహుశా ట్విట్టర్ చరిత్రలోని అత్యంత అనుమానాస్పద కాలాన్ని తోసిపుచ్చడానికి డోర్సీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
గతేడాది ట్విట్టర్ బోర్డు నుంచి వైదొలిగిన డోర్సీ ఇంటర్వ్యూలో.. కంపెనీపై విదేశీ ప్రభుత్వాల ప్రభావంపై అడిగినప్పుడు భారతదేశ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాడు. నిరసనలు తెలిపే రైతులు, ప్రభుత్వాన్ని విమర్శించే నిర్దిష్ట జర్నిలిస్టుల ఖాతాలు మూసివేయాలని భారత ప్రభుత్వం అభ్యర్థించిందని, అలా చేయకుంటే ఇండియాలో షట్ డౌన్ చేసి, ఇండియాలోని ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేస్తారని బెదిరించినట్లు డోర్సీ తెలిపాడు.
ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డోర్సీ నేతృత్వంలోని ట్విటర్, ఆయన బృందం భారత చట్టాలను పదేపదే ఉల్లంఘిస్తోందని అన్నారు. వాస్తవానికి వారు (ట్విట్టర్) 2020 -2022 వరకు చట్టం ప్రకారం నడుచుకోలేదని అన్నారు. 2022 జూన్ నుంచి మాత్రమే నిబంధనలను పాటిస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం ఎవరిని జైలుకు పంపించలేదని, ట్విట్టర్ ఆఫీస్ ను షట్‌డౌన్ చేయలేదని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. భారత్ పై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
From which angle is @jack a man of principles @esaagar?
— Smita Deshmukh🇮🇳 (@smitadeshmukh) June 13, 2023
He led a war on Indian conservatives - shadow-banning accounts. Flamed the farmer's protests with fake accounts & edited videos. Imagine a CEO carrying a placard - Smash Brahminical patriarchy in middle of an election year. pic.twitter.com/UZpBSV9tkc