ఇమ్రాన్ఖాన్ మద్దతుదారులపై పాక్ ఆర్మీ కాల్పులు.. పలువురు మృతి

పాక్ ఆర్మీ కాల్పులు.. పలువురు మృతి;

By :  Kiran
Update: 2024-02-09 16:06 GMT



పాకిస్తాన్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఉద్రికత నెలకొంది. పాక్ ఆర్మీ రిగ్గింగ్ కు పాల్పడిందని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. దీంతో పాక్ ఆర్మీకాల్పులు జరపడంతో పలువురు మృతి చెందగా, మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. పాక్ ఆర్మీ రిగ్గింగ్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. కౌంటింగ్ సందర్భంగా పాక్ ఆర్మీ రిగ్గింగ్ కు పాల్పడిందని దేశవ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆందోళన చేశారు. ఆ ఆందోళనలు చెదరగొట్టేందుకు కాల్పులు జరుపగా పలువురు మృతిచెందినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

పాకిస్థాన్‌లో గురువారం ఎన్నికలు జరగ్గా.. ఎన్నికలు ముగిసిన కాసేపటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తొలి ఫలితాన్ని ప్రకటించారు. ఫలితాల్లో జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌’ (PTI) పార్టీ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందినట్లు స్థానిక మీడియా పేర్కొంది. పీటీఐ వర్గాలు సైతం అదే విషయాన్ని చెబుతున్నాయి. ఇప్పటి వరకు పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం మాత్రం ఎవరు ఆధిక్యంలో ఉన్నారో అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పీఎంఎల్‌-ఎన్‌ సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ పార్టీకి చెందిన మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ గెలుపొందటం గమనార్హం.



Tags:    

Similar News