ఒక్క వేటతో రూ. 2 కోట్లు.. జాలరి సుడి సూపర్

Update: 2023-11-10 11:34 GMT

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ జాలరి తలరాత మారిపోయింది. కోట్ల విలువైన చేపల పంట పండింది. పాక్‌లోని కరాచీ తీరంలో వేటకు వెళ్లిన హాజీ బలూచ్ అనే జాలరి వలలో రూ. 2 కోట్ల విలులైన ‘సోవా’ జాతి చేపలు పడ్డాయి. ఇబ్రహీమ్ హైదరీ గ్రామానికి చెందిన బలూచ్ అరేబియా సముద్రంలో ఏళ్ల తరబడి చేపలు పడుతున్నా జీవితం అంతంత మాత్రంగాఃనే సాగుతుంది. గురువారం వేటకు వెళ్లి బలూచ్ బృందానికి అదృష్టం కలిసొచ్చిన సోవా చేపలు పడ్డాయి. ఔషధాలకు, సర్జరీలకు వాడే సోవా చేపలు విలువైనవి కావడంతో హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయి. వల్లో పడిన చేపలను పాక్ కరెన్సీలో రూ. 7 కోట్లకు అమ్ముడుపోయాయి. ఒక చేప ఏకంగా రూ. 20 లక్షలు( భారత కరెన్సీ) పలికింది. ఈ వేటతో తన దరిద్రం తీరిపోయిందని, వచ్చిన సొమ్మును తన బృందంలోని జాలర్లకు కూడా పంచుతానని బలూచ్ సంబరంగా చెప్పాడు. సోవా జాతి చేపల పొట్ట భాగాన్ని ఔషధాల తయారీకి వాడతారు. వాటి పొట్టలోని దారం లాంటి పదార్థాన్ని సర్జరీలో ఉపయోగిస్తారు. 20 కేజీల నుంచి 40 కేజీల వరకు పెరిగిగే ఈ చేపకు అరబ్ దేశాల్లో మాంచి గిరాకీ ఉంది.


Tags:    

Similar News