విమానంలో వింత పని చేసిన పాకిస్థానీ.. వీడియో వైరల్

Update: 2023-07-15 12:47 GMT

అనాథ ఆశ్రమాలు, ఆలయాల నిర్మాణాలకు విరాళాలు సేకరిస్తారు. ఈ విరాళాలను రోడ్లపై లేదా బస్ట్ స్టాప్, ఇళ్లలోకి వచ్చి అడుగుతుంటారు. కానీ ఓ పాకిస్థానీ ఏకంగా విమానంలోనే విరాళాలు అడిగారు. అతడు ఫేమస్‌ అవడానికి చేశాడో.. లేదా నిజంగానే విరాళాల కోసం ఇలా చేశాడో తెలియదు గానీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

విమానం గగనతలంలో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికుడు లేచి తన విరాళం కోసం ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. ‘‘మేము లాహోర్లో మదర్సా కడుతున్నాం. దీన్ని కోసం విరాళాలు సేకరిస్తున్నాం. మీరు డబ్బు ఇవ్వదలచుకుంటే నా వద్దకు వచ్చి ఇవ్వనవసరం లేదు. నేనే మీరు కూర్చున్న చోటుకు వస్తాను. నేనేమీ భిక్షాటన చేయడం లేదు. నాకు సాయం చేయండి’’ అంటూ అభ్యర్థించారు.

ఈ వీడియో ఎప్పుడు తీశారు అనేది తెలియలేదు కానీ రెండు వారాల క్రితం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇక అప్పటి నుంచి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న సమయంలో ఈ వీడియో వైరల్‌ అవడంతో దీనిపై పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ వీడియోలోని వ్యక్తి పాకిస్థాన్‌ సోషల్‌మీడియా సెన్సేషన్‌ అక్తర్‌ లావా అని కొందరు నెటిజన్లు చెబుతున్నారు.వ్యాపారస్థుడు, రాజకీయనాయకుడైన లావా పలు వీడియోలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. దీంతో తాజా వీడియో పాపులారిటీ కోసం చేశాడా లేక నిజంగానే విరాళాలు అడిగాడా అన్నది తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News