ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే పర్యాటక ప్రదేశం ఈఫిల్ టవర్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈఫిల్ టవర్‌ను కూల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు కాల్ చేశారు. దీంతో అలెర్టైన అధికారులు..ముందుజాగ్రత్తగా టవర్లలోని ఫ్లోర్ లన్నింటిని ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్ రంగంలోకి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఒక అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌తో పాటు మిగతా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఈ కట్టడానికి ఇలా బెదిరింపు కాల్స్ రావడం చాలా అరుదు. ఇప్పుడు ఒక్కసారిగా ఫోన్ చేసి పేల్చేస్తమని బెదిరించడంతో పారిస్ పోలీసులు అలర్ట్ అయ్యారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో దుండగులు కాల్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఈఫిల్ టవర్ నిర్మాణ పనులు జనవరి 1887లో ప్రారంభమై మార్చి 31, 1889న పూర్తయ్యాయి. 1889లో జరిగిన వరల్డ్ ఫెయిర్ సందర్భంగా దీనికి రెండు మిలియన్ల మంది సందర్శకులు వచ్చారు. గత సంవత్సరం ఈఫిల్ టవర్‌ను 6.2 మిలియన్ల మంది సందర్శించారు.