దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకులు బంద్.. ఇప్పుడెలా..?

Update: 2023-07-21 16:51 GMT

పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోబంలో పడిపోయింది. ద్రవ్యోల్బణం రేటులో పెరుగుదల వల్ల.. దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఆ ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఇంధన ధరలు, ట్యాక్స్ లను పెంచుతోంది అక్కడి ప్రభుత్వం. దీంతో పాక్ ప్రభుత్వానికి వ్యతికేకంగా అక్కడి పెట్రోలియం డీలర్లు శనివారం (జులై 22) నుంచి దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంక్ లను మూసేయాలని నిర్ణయించుకున్నారు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో పాక్ కరెన్సీ బలహీనపడింది. దీంతో పెట్రోలియం డీలర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పాక్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ పరిధిలో దాదాపు 10వేల పెట్రోల్ బంక్ లు ఉంటాయి. వాటన్నింటిని శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మూసేస్తారు. అంబులెన్స్, పాలు, పోలీస్ వాహనాలు.. ఇలా అత్యవసర వాహనాలకు కూడా పెట్రోల్ అమ్మెదిలేదని అసోసియేషన్ తీర్మానించింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయిన పాక్ లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి.


Tags:    

Similar News