Canada: కెనడాలో కూలిన విమానం.. భారత ట్రైనీ పైలట్ల మృతి..
By : Krishna
Update: 2023-10-07 08:00 GMT
కెనడాలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రిటిష్ కొలంబియాలో విమానం క్రాష్ అయ్యింది. పైపర్ పీఏ-34 సెనెకా అనే డబుల్ ఇంజిన్‌తో ఎయిర్ క్రాఫ్ట్ చిల్లివాక్ నగరంలోని ఓ హోటల్ వెనుక కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత్‌కు చెందిన ఇద్దరు ట్రైనీ పైలట్లు సహా ముగ్గురు మరణించారు. ముంబైకి చెందిన అభయ్ గద్రూ, యష్ విజయ్ రాముగదేతో పాటు మరో పైలట్ మరణించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.