మోడీ వ్యాఖ్యలతో బిత్తరపోయిన పాక్ ప్రధాని

Update: 2023-07-04 11:30 GMT

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ద్వంద్వ వైఖరిని పాటించొద్దని ప్రధాని మోడీ అన్నారు. షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో ప్రధాని ప్రసంగించారు. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉగ్రవాదం, టెర్రర్ ఫైనాన్సింగ్‌ను ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని మోడీ నొక్కి చెప్పారు.

కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని.. ఉగ్రవాదమే తమకు కీలక విధానంగా అవి మార్చుకుంటున్నాయని మోడీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా పాక్ను ఉద్దేశించి అనడంతో ఆ దేశ ప్రధాని బిత్తరపోయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందన్నారు. ఉగ్రవాదం ఎలాంటి రూపాంలో ఉన్న సభ్యదేశాలు వ్యతిరేకించాలని కోరారు.

అన్ని దేశాలకు ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభం పెద్ద సవాల్గా ఉందని.. దీన్ని ఎదుర్కొనేందుకు అందరూ ఐక్యంగా కృష్టి చేయాలని మోడీ పిలుపునిచ్చారు.ఉగ్రవాదాన్ని నిరోధించే విషయంలో ఈ కూటమి ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయదని మోడీ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్ ఆందోళన చెందుతుందని, భారత్ లాగే ఇతర సభ్యదేశాల పరిస్థితి ఉందని ప్రధాని అన్నారు. ఈ కూటమిలో ఇరాన్ కొత్త సభ్యదేశంగా చేరడాన్ని ప్రధాని స్వాగతించారు.

షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కు ఈ ఏడాది ఎస్‌సీఓ సమావేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తోంది. భారత్, పాకిస్తాన్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఇరాన్ దేశాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Tags:    

Similar News