America Winter Storm : అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. 2వేల విమానాలు రద్దు

Byline :  Krishna
Update: 2024-01-13 05:49 GMT

అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాన్ గజగజ వణికిస్తోంది. మిడ్వెస్ట్ చుట్టు పక్కల రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. దీంతో చాలాచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. తుఫాన్ వల్ల 2వేల విమానాలు రద్దవగా.. మరో 2400 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చికాగోలోని ఓహేర్ ఎయిర్ పోర్టులో 40శాతం విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ విమానశ్రయంలో సుమారు 853. ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేయగా..650 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు.

మంచు తుఫాన్ వల్ల అమెరికాలోని చాలా ప్రాంతాలు చీకట్లోనే ఉన్నాయి. గ్రేట్ లేక్స్, సౌత్ ప్రాంతాల్లో సుమారు 2.5 లక్షల ఇళ్లు, ఆఫీసులకు కరెంట్ లేదు. ఇల్లినాయస్లో దాదాపు లక్ష మంది చీకట్లోనే ఉన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ్టి నుంచి మిడ్వెస్ట్లో 6 నుంచి 12 అంగుళాల మంచు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్ఃరమత్తంగా ఉండాలని సూచించారు. 


Tags:    

Similar News