ట్రక్కులో ప్రయాణించిన రాహుల్.. ఈసారి ఇండియాలో కాదు..

Update: 2023-06-13 11:16 GMT

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికాలో పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా ఆయన ట్రక్కులో ప్రయాణించారు. వాషింగ్టన్‌ నుంచి న్యూయార్క్‌ దాకా తల్జిందర్ సింగ్‌ అనే డ్రైవర్‌తో ముచ్చటిస్తూ ట్రక్కులో ట్రావెల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

డ్రైవర్లకు సంబంధించి పలు విషయాలను ట్రక్ డ్రైవర్ తల్జిందర్‌ సింగ్ను అడిగి రాహుల్ తెలుసుకున్నారు. ట్రక్కు డ్రైవర్లు ఎలా పని చేస్తారు..? ట్రక్కు ఫీచర్లు ఏమిటి..? వారికి చలాన్లు పడతాయా..? డ్రైవర్లు ఎంత ఆదాయం సంపాదిస్తారు? వంటి విషయాలను అడిగారు. అక్కడ డ్రైవర్లు నెలకు రూ.8 లక్షల దాకా సంపాదిస్తారని తెలిసి రాహుల్ ఆశ్చర్యపోయారు.


ఆ తర్వాత ఏదైనా పాట వినిపించాలా అని ట్రక్ డ్రైవర్ అడగ్గా.. రాహుల్ ఒకే అన్నాడు. దీంతో సిద్ధూ మూసేవాలా పాటను పెట్టుమంటరా అని అనగా.. 295 సాంగ్ను ప్లే చేయమని రాహుల్ సూచించారు. ఆ తర్వాత ట్రక్కును ఓ రెస్టారెంట్‌ వద్ద ఆపి.. డ్రైవర్తో కలిసి రాహుల్‌ లోపలికి వెళ్లి తిన్నారు. ఆ తర్వాత అక్కడున్న వారిని పలకరించి.. అందరితో కలిసి ఫొటోలు దిగారు.

Full View


Tags:    

Similar News