పుతిన్ హెచ్చరిక.. ‘దేశ ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధం’

Update: 2023-06-24 11:20 GMT

వాగ్నర్ గ్రూప్‌ అధిపతి ప్రిగోజిన్ తన వ్యక్తిగత లాభం కోసం రష్యాకు ద్రోహం చేస్తున్నాడని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఇది దేశ ద్రోహం, వెన్నుపోటుతో సమానమని పుతిన్ ఆరోపించారు. దేశ రక్షణ కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమని.. దేశంపై కుట్నపన్నుతూ ఆయుధాలు చేపట్టినవాళ్లపై కఠిన చర్యలు తప్పవని పుతిన్ హెచ్చరించారు. వాగ్నర్ గ్రూప్‌ తిరుగుబాటు నేపథ్యంలో.. దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వాగ్నర్ సైన్యంతో మాట్లాడిన ప్రిగోజిన్.. ‘మీరంతా మోసపోయారు. మిమ్మల్ని ఒక నేరంలోని నెట్టేశారు. మీరంతా స్థానిక అధికారులను సంప్రదించాలి. దానికి బదులుగా వారి భద్రతకు ఎలాంటి ప్రమాదం ఉండదని’ అన్నారు.

వాగ్నర్ గ్రూప్‌కు మద్దతుగా స్టోమ్ జెడ్:

ప్రిగోజిన్ గ్రూప్ కు మద్దతుగా స్టోమ్ జెడ్ మద్దతు ప్రకటించింది. వీడియో సందేశం విడుదల చేసిన స్టోమ్ జెడ్.. వాగ్నర్ గ్రూప్ వెంట రావడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. స్టోమ్ జెడ్ అంటే.. రష్యన్ జైళ్ల నుంచి బలవంతంగా నిర్బంధించిన ఖౌదీల సమూహం. రష్యా రక్షణ శాఖ దీన్ని ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉండగా పుతిన్ నియమించిన క్రిమియా గవర్నర్.. పుతిన్ కు మద్దతు పలికారు. డొనెట్స్క్, లుహాన్స్క్ కూడా పుతిన్ వెంట ఉంటామని హామీ ఇచ్చారు. వీరి మద్దతులో వాగ్నర్ గ్రూప్ కు ఎలాంటి నియామకాలు జరగవని తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించిన ప్రకటనతో మాస్కోలో ఉన్న బిల్ బోర్డులను తీసేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Tags:    

Similar News