పచ్చి శాకాహారం తింటున్నారా? ఈమె చచ్చిపోయింది జాగ్రత్త!

Update: 2023-08-01 08:55 GMT

శాకాహారం మంచిదా, మాంసాహారం మంచిదా అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం. అలవాట్లు, ఆరోగ్యం, సంప్రదాయాలు, అందుబాటులో ఉన్న ఆహారం వంటివన్నీ లెక్కలోకి తీసుకోవాలి. మాంసాహారం తినేవాళ్లందరూ రాక్షసులు కాదు, శాకాహారం పుచ్చుకునేవాళ్లందరూ దేవతలు కారు. ఏం తిన్నా చక్కగా ఉడకబెట్టుకుని తినాలి. లేకపోతే అజీర్ణమే కాదు, ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. కేవలం పచ్చి శాకాహారం మాత్రమే తిన్న ఓ మహిళ తీవ్ర అనారోగ్యం పాలై చనిపోయింది.

రష్యాకు చెందిన వేగన్ ఇన్‌ఫ్లుయెన్సర్ జాన్నా సామ్సనోవా(39) సోషల్ మీడియా ద్వారా పచ్చి శాకాహారాన్ని ప్రోత్సహిస్తూ వీడియోలు చేసేది. గోధుమ గడ్డి నుంచి టమాటా, క్యాప్సికమ్, ఆనియన్స్, కీరా, కేరట్ వంటి నానా కూరగాయలను పచ్చిపచ్చిగా తింటేనే ఆరోగ్యం బావుంటుందని ప్రచారం చేసేది. ఉడకబెడితే పోషకాలు పోయి పిప్పి తిన్నట్టు ఉంటుందని చెప్పేది. ఆమె ఏడేళ్ల నుంచి ముప్పొద్దులా కేవలం పనసకాయలు మాత్రమే తింటున్నట్లు ఓ స్నేహితురాలు చెప్పింది. పదేళ్లపాటు పచ్చి కూరగాయల ఉద్యమాన్ని కొనసాగించిన సామ్సనోవా తీవ్ర అనారోగ్యం పాలైంది. ఇటీవల శ్రీలంక వెళ్లిన ఆమెకు కాళ్లు వాచాయి. పరిస్థితి విషమించడంతో స్వదేశానికి వెళ్లింది. తర్వాత కొద్ది రోజులకే గత నెల 21న కన్నుమూసింది. శాకాహారం మాత్రమే తీసుకోవడం వల్ల ఆమె శరీరానికి అందాల్సిన పలు రకాల ప్రొటీన్లు, విటమిన్లు అందక కీలక అవయవాలు పనిచేయక చనిపోయినట్లు భావిస్తున్నారు. తన కూతురు కలరా లక్షాణాలతో చనిపోయి ఉండొచ్చని సామ్సనోవా తల్లి వెచెర్న్యాయా చెప్పింది.





Tags:    

Similar News