మందు తాగితే మటాష్..200 రోగాలు కొని తెచ్చుకున్నట్లే!

Update: 2023-06-17 03:19 GMT

మీసం వచ్చిన ప్రతోడు మందు బాటిల్ ముందేసుకుని కూర్చుంటున్నారు. లవ్ ఫెల్యూర్ అని, సమస్యల్లో ఉన్నానని, నిద్ర పట్టడం లేదని ఇలా మద్యం తాగేవారు రకరకాల కారణాలు చెబుతూ తమను తాము సమర్థించుకోవడం సర్వసాధారణమైపోయింది. ఒక్క పెగ్గు తాగితే కొంపెలేమీ మునిగిపోవని. డాక్టర్లు కొద్దిగా మద్యం సేవిస్తే మంచిదని చెప్పారని బుకాయిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ పాపులేషన్‌ హెల్త్‌, పెకింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాలు విస్తుపోయే వాస్తవాలను వెల్లడిస్తున్నాడు. గతంలో మద్యం తాగితే 28 రోగాలకు కారణం అవుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్థారించింది. అయితే తాజా అధ్యయనాలు మాత్రం మందుబాబులు బిత్తరోయేలా చేస్తున్నాయి. ప్రత్యక్షంగా 61 రోగాలు, పరోక్షంగా 206 వ్యాధులకు మద్యం కారణం అవుతోందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. కొంచం తాగినా ఎక్కువ తాగినా మందు మానవ శరీరంలోని అవయవాలపై దుష్ప్రభావం చూపిస్తుందని నేచర్ మెడిసిన్ జర్నల్‎లో పబ్లిష్ చేసిన అధ్యయనం చెబుతోంది. కేవలం మందు తాగడం వల్లనే 30 లక్షల మంది ప్రతి సంసవత్సరం వరల్డ్ వైడ్‎గా మరణిస్తున్నారని, ఎన్నో కోట్ల మంది ప్రజల అవయవాలు పనిచేయడం లేదని తేల్చి చెప్పింది.

మద్యం తాగే అలవాటు ఉన్న వివిధ వయసులకు చెందిన 5,12,724 మంది ప్రజలపై చైనాలో అయిదేళ్లపాటు శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. మద్యానికి బానిసలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సుమారు లక్ష మందికి పైగా బాధితులను పరిశీలించారు. వారిలోని ఆరోగ్య సమస్యలను అధ్యయనం చేశారు. వారి జీవనశైలి, ప్రవర్తన ఎలా ఉంది, మద్యం అలవాటును ఎలా చేసుకున్నారు వంటి విషయాలను సుదీర్ఘంగా పరిశీలించారు. మద్యం తాగడం వల్ల అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది అన్న అంశాలను విశ్లేషించారు. ప్రతి రోజు మందు తాగేవారిని, అప్పుడప్పుడు అకేషనల్‎గా మద్యం సేవించేవారిని గుర్తించి వారి అనారోగ్య పరిస్థితులపై అధ్యయనం చేశారు పరిశోధకులు. సుమారు 12 ఏళ్ల రికార్డులను సుదీర్ఘంగా పరిశీలించి మద్యం తీవ్రతను అంచనా వేశారు. జన్యు విశ్లేషణ కూడా చేశారు. ఈ అధ్యయనంలో మద్యం సేవించే 35 ఏళ్ల నుంచి 84 ఏళ్ల లోపు వారు ఆస్పత్రుల్లో చేరి మరణించారని ఈ జర్నల్ చెబుతోంది. 

Tags:    

Similar News