కుక్క మాంసంపై సంచలన నిర్ణయం.. నిషేధిస్తూ చట్టం

Update: 2023-11-18 14:09 GMT

చైనా ప్రజలు కుక్కలను, కప్పలను తింటారు. అదో ఆచారం, అలవాటు. చైనాలోనే కాకుండా పలు ఆగ్నేయాసియా దేశాల్లో సైతం ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. కుక్కలను తింటారని ఇతర దేశాల ప్రజలు వారిని ఏవగించుకుంటారు, తక్కువగా చూస్తారు. మూగజీవులు క్రూరంగా చంపేస్తున్నారంటూ ‘పెటా’ వంటి జంతుహక్కుల సంస్థలు చేసే గోల గురించి చెప్పాల్సిన పనేలేదు. కేవలం కుక్క మాంసం కారణంగా ప్రపంచ దేశాల దృష్టిలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని చైనా, దక్షిణ కొరియా తదితర దేశాల ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కుక్క మాంసాన్ని పూర్తిగా నిషేధించేందుకు ఓ బిల్లును తీసుకొచ్చింది. ప్రభుత్వానికి పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉండడంతో త్వరలోనే ఇది చట్టంగా మారనుంది. ప్రభుత్వం కుక్క మాంసంపై జరిపిన సర్వేలతో అది తమకిష్టం లేదని 64 శాతం మంది చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం నిషేధం తీసుకొస్తోంది.

డాగ్ మీట్‌ను 2027 నాటికల్లా పూర్తిగా పక్కన పెడతామని అధికార పీపుల్ పవర్ పార్టీ చెబుతోందిది. ఈ మాంసంపై తీవ్ర ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, యువత కూడా దీన్ని అవమానంగా భావిస్తోందని పార్టీ నేతలు చెప్పారు. నిషేధం వల్ల జీవనోపాధి కోల్పోయే వ్యాపారులకు ఆర్థిక సాయం అందించాలని బిల్లులో ప్రతిపాదించారు. దక్షిణ కొరియాలో ప్రస్తుతం 1150 కుక్కల ఫారాలు, 34 కబేళాలు, 214 పంపిణీ కేంద్రాలు, 1600 డాగ్ ఫుడ్ హోటళ్లు ఉన్నాయి. ఈ మాంసంపై వివాదాలకు తెరదించుతామని పీపుల్ పవర్ పార్టీ అగ్రనేతత యు ఇయు-డాంగ్ అన్నారు.


Tags:    

Similar News