Go First Airline : గో ఫస్ట్కు గుడ్ న్యూస్.. కొనుగోలుకు ముందుకొచ్చిన స్పైస్జెట్..

Byline :  Kiran
Update: 2024-02-16 13:48 GMT

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి దివాళా తీసిన గో ఫస్ట్ ఎయిర్లైన్స్కు మళ్లీ మంచిరోజులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్, బిజీ బీ ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్తో కలసి గో ఫస్ట్ కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఎయిర్ లైన్స్కు స్పెస్ జెట్ ఆపరేటింగ్ పార్ట్నర్గా వ్యవహరించనుంది. ఆ సంస్థకు అవసరమైన సిబ్బంది, సేవలను అందించనుంది.

గో ఫస్ట్‌ కొనుగోలుకు సంబంధించి ఆసక్తిని వ్యక్తపరుస్తూ స్పైస్ జెట్ డిసెంబరు 19న రెగ్యులేటరీ ఫైలింగ్‌ను దాఖలు చేసింది. కంపెనీ ఆర్థికస్థితి, అభివృద్ధి ప్రణాళిక కోసం దాదాపు 270 మిలియన్ల డాలర్ల మూలధన సేకరణ జరపనున్నట్లు చెప్పింది. స్పైస్ జెట్ తో పాటు షార్జాకు చెందిన స్కై వన్, ఆఫ్రికాకు చెందిన సఫ్రిక్ ఇన్వెస్ట్ మెంట్స్, అమెరికాకు చెందిన ఎన్ఎస్ ఏవియేషన్ తదితర సంస్థలు ఆసక్తి చూపాయి. అయితే వీటన్నింటిలోకి స్పైస్ జెట్ అనుభవం ఎక్కువ ఉండటంతో రేసులో ముందుంది.

గో ఫస్ట్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందు రాకపోవడంతో ఆ సంస్థకు కు అప్పులిచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IDBI బ్యాంకులు ఈ ఏడాది ప్రారంభంలో లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, IDBI బ్యాంక్, డ్యుయిష్ బ్యాంకులకు గో ఫస్ట్ దాదాపు రూ. 65.21 బిలియన్లు డాలర్ల బకాయి ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మూడు కంపెనీలు గో ఫస్ట్ ను టేకోవర్ చేసుకునేందుకు ముందుకు రావడంతో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ కంపెనీ దివాళా ప్రక్రియను 60 రోజులు పొడగించింది. అయితే ఈ నిర్ణయంపై కొందరు లీజుదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరోవైపు స్పైస్ జెట్ ప్రమోటర్ సహా ఆసక్తి వ్యక్తపరిచిన మూడు కంపెనీలు ఫిబ్రవరి 15 కల్లా గో ఫస్ట్ పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. లేని పక్షంలో దివాళా ప్రక్రియ కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో స్పైస్ జెట్ సహా మూడు కంపెనీలు వాటిని సమర్పించాయి. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన గో ఫస్ట్ IBC సెక్షన్ 10 కింద మే 2, 2023న దివాలా ప్రకటించింది. మే 10న NCLT ఆ అభ్యర్థనను అంగీకరించింది.

Tags:    

Similar News