బురఖా వేస్తే రూ. 91 వేల జరిమానా.. చట్టానికి ఆమోదం

Byline :  Mic Tv Desk
Update: 2023-09-21 17:05 GMT

హక్కుల ఉల్లంఘన అంటూ వస్తున్న విమర్శలను పట్టించుకోకుండా స్విట్లర్లాండ్ పార్లమెంటు కీలక నిర్ణయం తీసుకుంది. బురఖాను నిషేధిస్తూ ప్రతిపాదించిన బిల్లుకు దిగువ సభ 151-29 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. బిల్లును ఎగువ సభ ఇప్పటికకే ఆమోదింది. విస్తృతమైన చర్చలు, ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ప్రభుత్వం బురఖాను నిషేధించింది. చట్టం అమల్లోకి వచ్చాక ఎవరైనా సరే బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరిస్తే కేసులు పెట్టి జరిమానా విధిస్తారు. 1,100 డాలర్ల(రూ.91,300) జరిమానా పడుతుంది. మహిళలు ముక్కు, నోరు, కళ్లను కప్పి వేసేలా ముసుగులు ధరించకూడదు. స్కార్ఫ్ కట్టుకోవచ్చు. స్విస్ పీపుల్స్ పార్టీ చొరవతో బురఖా నిషేధ బిల్లు ఆమోదం పొందింది. ఫ్రాన్స్, బెల్జియం తదతర దేశాలు కూడా ముఖం కనిపించనివ్వని బురఖాలపై ఆంక్షలు విధించిన స్విస్ కూడా అదే బాట పట్టింది. అయితే స్విట్లర్జాండులో ముఖాన్ని పూర్తిగా దాచేసే ముస్లింలు అతి తక్కువ మంది మాత్రమేనని హక్కుల సంఘాలు చెబుతున్నాయి. 


Tags:    

Similar News